కావాల్సినవి: అరటి పండ్లు -2, స్ట్రాబెర్రిస్-10, చల్లని పాలు -100 ml ,పంచదార-తగినంత, ఐస్ క్యూబ్స్-2/3(ఆప్షనల్)
తయారీ: ముందుగా మిక్సీ జార్ లో అరటి పండ్లు ,స్ట్రాబెర్రిస్ ని ముక్కలుగా కోసుకుని వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి తర్వాత చల్లని పాలు,పంచదార,ఐస్ క్యూబ్స్ కూడా వేసి మరొకసారి మిక్సీ వేసుకుని గ్లాస్సెస్ లోకి తీసుకుని స్ట్రాబెర్రిస్ తో అలంకరించి అతిధులకు చల్లగా అందించాలి.
నోట్:పంచదార లేకపోయినా పర్వాలేదు అరటి పండ్లు వాడుతున్నాం కనుక తియ్యగా ఉంటుంది. అలానే ఐస్ క్యూబ్స్ లేనప్పుడు జ్యూస్ ని కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కావలసినప్పుడు వాడుకోవచ్చు.
No comments:
Post a Comment