గుగ్గిళ్ల చారు :
- కొమ్ము శెనగలు ఉడకపెట్టిన నీరు - 1 కప్పు
- టమాటా -1
- చింతపండు - చిన్న నిమ్మకాయ అంత
- కొత్తిమీర -2 రెమ్మలు
- ఉప్పు - తగినంత
- పసుపు - చిటికెడు
- రసం పొడి - 1/2 టీస్పూన్
- నూనె - 3 టేబుల్ స్పూన్లు
- జీలకర్ర - 1/4 టీస్పూన్
- ఆవాలు - 1/4 టీస్పూన్
- పచ్చిపప్పు - 1/2 టీస్పూన్
- మినపప్పు - 1/2 టీస్పూన్
- ఇంగువ - చిటికెడు
- ఎండుమిర్చి -2
- వెల్లులి - 2 రెబ్బలు
- కరివేపాకు - 2 రెమ్మలు
ముందుగా ఒక గిన్నెలో కొమ్ము శెనగలు ఉడకపెట్టిన నీరు, టమాటా ముక్కలు ,చింతపండు , ఉప్పు, పసుపు, రసం పొడి మరియు 1/2 కప్పు నీరు పోసి బాగా మరిగించాలి.
తర్వాత కడాయిలో నూనె పోసి , నూనె వేడెక్కిన తర్వాత తాలింపు కొరకు పెట్టుకున్న సామాను మరియు దంచిన వెల్లులి వేసి అవి చిటపటలాడిన తరువాత చారులో వేసి మరియొక నిమిషం మరిగించుకోవాలి, చివరగా కొత్తిమీర చల్లుకుని వేడి వేడి అన్నం లో వడ్డించుకుని తినడమే.
No comments:
Post a Comment