కావాల్సినవి :
- చిక్కుడుకాయలు - 1/2 కేజీ
- ఉల్లిపాయలు - 1 పెద్దది
- టమోటా - 1 చిన్నది (ఆప్షనల్)
- ఉప్పు - రుచికి సరిపడినంత
- పసుపు - చిటికెడు
- కారం - 1 టీస్పూన్
- నూనె - 3 టేబుల్ స్పూన్లు
- జీలకర్ర - 1/4 టీస్పూన్
- ఆవాలు - 1/4 టీస్పూన్
- పచ్చిపప్పు - 1/2 టీస్పూన్
- మినపప్పు - 1/2 టీస్పూన్
- ఇంగువ - చిటికెడు
- ఎండుమిర్చి -2
- వెల్లులి - 2 రెబ్బలు
- కరివేపాకు - 2 రెమ్మలు
తయారీ : చిక్కుడుకాయ ముక్కలని కొద్దిగా పసుపు వేసి ఉడకపెట్టి పక్కనపెట్టుకోవాలి. కడాయిలో నూనె పోయాలి .
నూనె వేడెక్కిన తరువాత తాలింపు కొరకు తీసుకున్న సామాను వేసి అవి చిటపటలాడిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాలు వేపి ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి.
ఉప్పు మరియు కొద్దిగాపసుపు వేసి 2 నిమిషాలు వేయించుకున్నాక టమాటా ముక్కలు వేసి 3 నిమిషాలు మగ్గించుకుని చివరగా కారం చల్లుకుని సర్వ్ చేసుకోడమే.
No comments:
Post a Comment