మినప సున్ని ఉండలు:
నల్ల మినుములు-1 కప్పు,
బెల్లం-1/2 కప్పు,
యాలకులు-3,
నెయ్యి-3/4 కప్పు.
తయారీ:ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి మినుములు, యాలకులు వేసుకుని నూనె లేకుండా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి.
తరువాత మినుములని కొంచెం చల్లారనిచ్చి,యాలకులతో పాటుగా మిక్సీ లో వేసి మెత్తని పొడి చేసుకుని, చివరగా తురిమిన బెల్లం పొడి కూడా వేసి మరొక్క సారి మిక్సీ వేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి.
తరువాత కరిగించిన నెయ్యిని కొద్దీ కొద్దిగా వేసుకుంటూ ఉండలు చేసుకోటానికి వీలుగా కలుపుకుని, చేతితో గుండ్రని ఉండలు చుట్టుకొని జీడీ పప్పుతో అలంకరించుకుని ప్లేటులో కి తీసుకోవాలి. అంతే ఎంతో రుచికరం మరియు ఆరోగ్యమైన సున్ని ఉండలు రెడీ.
నోట్:నల్ల మినుములకి బదులుగా తెల్లని మినప గుళ్ళు కూడా వాడుకోవచ్చు కాకపోతే నల్ల మినుములు చాల ఆరోగ్యకరమైనవి. అలానే బెల్లానికి బదులు పంచదార కూడా వాడుకోవచ్చు.. తీపి ఎక్కువ కావాలి అనుకునే వారు 1/2 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది.
No comments:
Post a Comment