ఆలూ గోబీ కర్రీ :
బంగాళా దుంపలు-2,
క్యాలీఫ్లవర్ పువ్వులు-1 కప్పు,
టమాటా ముక్కలు -1 కప్పు,
ఉల్లిపాయ-1,
అల్లం వెల్లుల్లి ముద్ద - 2 టేబుల్ స్పూన్స్,
గరం మసాలా-1 టేబుల్ స్పూన్స్,
పచ్చి మిర్చి-2,
కారం-1 టీ స్పూన్,
ధనియాల పొడి-1/2 టీ స్పూన్,
ఉప్పు-తగినంత,
కొత్తిమీర-కొద్దిగా,
నూనె-2 టీ స్పూన్స్,
ఆవాలు-3/4 టీ స్పూన్,
జీల కర్ర-1/2 టీ స్పూన్,
పచ్చి పప్పు-1 టీ స్పూన్,
పసుపు-కొద్దిగా,
కరివేపాకు-2 రెమ్మలు.
తయారీ:ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె పోసి వేడి అయ్యాక ఆవాలు,జీలకర్ర,పచ్చి పప్పు,కరివేపాకు,పసుపు వేసి వేగించి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి 2 నిమిషాలు వేయించాక టమాటా ముక్కలు వేసి ముక్క మెత్తబడే వరకు మగ్గించుకోవాలి.
కారం,గరం మసాలా,ధనియాలపొడి వేసి కలిపి తరువాత బంగాళాదుంప ముక్కలు,క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి ఉప్పు చల్లి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి.
తరువాత ముక్కలు మునిగే వరకు నీరు పోసి మరో 10 నిమిషాలు కూర దగ్గరికి పడే వరకు ఉడికించుకుని కొత్తిమీర చల్లుకుని గిన్నెలోకి తీసుకుని వడ్డించుకోవాలి.
ఈ కూర చపాతీ,రోటి,అన్నం లోకి రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment