కావాల్సినవి:
- క్యాబేజీ తరుగు-1 పెద్ద కప్పు,
- పెసర పప్పు-3/4 కప్పు
- అల్లం వెల్లుల్లి ముద్ద-1 టేబుల్ స్పూన్
- నూనె-3 టేబుల్ స్పూన్స్
- గరం మసాలా-1 టీ స్పూన్
- ఆవాలు -1/2 టీ స్పూన్
- జీలకర్ర-1/2 టీ స్పూన్
- పచ్చి సెనగ పప్పు-1 టీ స్పూన్
- ఉల్లిపాయ-1
- కారం-1 టీ స్పూన్
- పచ్చి మిర్చి-1 లేదా 2
- కరివేపాకు- రెమ్మలు
- కొత్తిమీర-కొద్దిగా
- ఉప్పు-తగినంత
- పసుపు-చిటికెడు
నోట్: పెసరపప్పుని 20 నిమిషాలు పాటు మంచి నీటిలో నాన పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి.
తయారీ:
ముందుక ప్రెషర్ కుక్కర్ లో సన్నగా తరిగిన క్యాబేజీ వేసి శుభ్రంగా కడిగి, 1కప్పు నీరు పోసి 1 కూత వచ్చే వరకు ఉంచి పక్కన పెట్టుకోవాలి.
తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిసెనగపప్పు, కరివేపాకు, పసుపు వేసి వేగాక, ఉల్లిపాయ ముక్కలు , పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయే వరకువేయించుకోవాలి .
తరువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ మరియు నాన పెట్టుకున్న పెసరపప్పుని వేసి ఉప్పు చల్లి కలయపెట్టుకుని , మూత పెట్టి మీడియం మంట మీద 10 నిమిషాలు మగ్గించుకోవాలి.
పెసరపప్పు మెత్త పడింది అనుకున్నప్పుడు గరం మసాలా,కారం వేసుకుని కలయపెట్టుకుని మరో 5 నిమిషాలు మగ్గించి , చివరగా కొత్తిమీర చల్లుకుని గిన్నెలోకి తీసుకుని వడ్డించుకోవాలి. ఈ కూర చపాతీ, రైస్, రోటి లోకి చాల రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment