కావాల్సినవి :
- పండిన మామిడికాయ-1,
- పంచదార-2 టేబుల్ స్పూన్స్,
- చల్లని పాలు -1 పెద్ద గ్లాస్,
- జీడిపప్పు,పిస్తా-అలంకరించుకోటానికి సరిపడా.
తయారీ:
ముందుగా మామిడికాయ తొక్క తీసి ముక్కలుగా కోసుకుని మిక్సీ జార్ లో వేసి,పంచదార కూడా వేసి గుజ్జులా అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి.
తరువాత చల్లని పాలు కూడా పోసుకుని మరొక్క సారి మిక్సీ పట్టుకుని గ్లాస్లోకి తీసుకుని జీడిపప్పు,పిస్తా తో అలంకరించుకుని అతిధులకు చల్ల చల్లగా అందించాలి.

నోట్:
మిక్సీ వేసేటప్పుడు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు లేదా మిక్సీ వేసాక మాంగో మిల్క్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని, తాగే ముందు జీడిపప్పు, పిస్తా వేసుకుంటే రుచిగా ఉంటుంది. అలానే చిక్కని పాలు వాడితే మరింత రుచిగా ఉంటుంది మిల్క్ షేక్ .

No comments:
Post a Comment