Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Monday, 31 October 2016

Persian restaurant, Stuttgart(పెర్షియన్ రెస్టారెంట్, స్టూట్ట్గర్ట్)
స్టూట్ట్గర్ట్ లో ఉన్నటువంటి పెర్షియన్ రెస్టారెంటు యొక్క వివరాలు ఈరోజు రివ్యూ లో తెలుసుకుందాం. పెర్షియన్ శైలి వంటలని ఇరానియన్ శైలి అనికూడా పిలుస్తారు.

Beerakaya pachhi pappu kura/ridge gourd curry(బీరకాయ పచ్చిపప్పు కూర)


కావాల్సిన పదార్ధాలు : బీరకాయలు- 2 పెద్దవి, పెద్ద ఉల్లిపాయ-1, నీటిలో నాన  పేట్టిన పచ్చిపప్పు - 1/2 కప్పు,  పచ్చిమిర్చి-3, టమాట -1 పెద్దది , అల్లం వెల్లుల్లి ముద్ద -1 టేబుల్ స్పూన్ , జీలకర్ర-1/2 టీస్పూన్, పసుపు- కొద్దిగా, లవంగాలు-3/4, ఎండుమిర్చి-2, ఆవాలు-1/2టీస్పూన్ ,ఉప్పు-తగినంత, నీరు-1/2 కప్పు, కరివేపాకు-2 రెమ్మలు, కొత్తి మీర -తగినంత, ధనియాలపొడి మరియు గరంమసాల -1 టీస్పూన్ చొప్పున.

Draksha rasam/Grape juice)(ద్రాక్ష రసం)


కావాల్సినవి :
నల్ల ద్రాక్షాలు -1 కప్పు , పంచదార -1 టేబుల్ స్పూన్ , నీళ్లు - 1/4 కప్పు .

Saturday, 29 October 2016

Tips with curd

 1.  ఒక కప్పు పెరుగులో కొద్దిగా జీలకర్ర పొడి కలిపికుని తింటే బరువు త్వరగా తగ్గుతారు. 
 2.  అల్సర్లు మాయం అవ్వాలంటే కప్పు పెరుగులో ఒక టీస్పూన్ తేనే కలుపుకుని సేవించాల్సిందే. 
 3.  వృద్దాప్య ఛాయలు మరియు కీళ్లనొప్పులు పోవాలంటే కప్పు పెరుగులో పావు కప్పు ఆరంజ్ జ్యూస్ కలిపి  సేవించడమే . 

Friday, 28 October 2016

Attractions of Amsterdam(ఆమ్స్టర్డామ్, నెథర్లాండ్స్)

కొత్త కొత్తగా ఉన్నదీ స్వర్గమిక్కడే అన్నది, కోటితరాలే.పులయేరులై.. నేలచేరగానే... ఏమిటా నెథర్లాండ్ గురించి చెప్పుకుండా కూలి నo.1 పాట పడుతున్నారు అనుకోకండి, అక్కడికే  వస్తున్నాము, ఆ పాటలో మనకు కనిపించే పూల తోటలు చూసి, మనం కూడా ఒక్కసారి అక్కడికి వెళ్ళాలి అని అనుకోని వారు ఉండరు కదా. అలా అనుకున్న వారిలో మేము ఉన్నాము .ఈ  వేసవి కాలం విహారయాత్రలో భాగంగా అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ యాత్ర యొక్క విశేషాలు మీకోసం. ఆమ్స్టర్డామ్ నెథర్లాండ్స్


Wednesday, 26 October 2016

Neuschwanstein castle, Germany


సముద్ర మట్టానికి 800 మీటర్ల ఎత్తులో కట్టబడిన ఈ కోట యొక్క విశేషాలు తెలుసుకుందాం . ఈ కోటని 2వ- లుడ్విగ్ రాజు 1868 వ సంవత్సరంలో కట్టించారు. అతనికి బహు సిగ్గు, ప్రజలకి దూరంగా అజ్ఞాతంలో ఉండదల్చి ఈ కోటని కొండపైన కట్టించుకున్నాడు. రాజుగారు చనిపోయిన ఏడు వారాల తర్వాత ఈ కోటని ప్రజల సందర్శనార్థం తెరిచారు.

Allam charu/ Ginger rasam(అల్లం చారు)


కావాల్సినవి :
టమాటాలు- 2, పచ్చిమిర్చి -1/2, అల్లం - 1 అంగుళం, చింతపండు - 1/2 నిమ్మకాయ అంత ,కొత్తిమీర - 2 రెమ్మలు, రసం పొడి - 1 టీస్పూన్, పసుపు -చిటికెడు, ఉప్పు -తగినంత, నీళ్లు - 3 కప్పులు.

puttagodugu kura/Mushroom curry(పుట్టగొడుగు పచ్చి బఠాణి కూర)


కావాల్సిన పదార్ధాలు:
పుట్టగొడుగులు- 200 గ్రాములు, పచ్చిమిర్చి-3, టమాటా ముక్కలు-1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు -3/4, అల్లం- 1 చిన్న ముక్క, పచ్చి బఠాణి -1/2 కప్పు, జీలకర్ర-1టీస్పూన్,  ఉల్లిపాయముక్కలు -1చిన్నకప్పు, ధనియాల పొడి - 1టీస్పూన్, గరం మసాలా-1టీస్పూన్, నూనె-2టేబుల్ స్పూన్స్, కారం-1 టీస్పూన్, కొత్తిమీర- తగినంత, ఉప్పు-సరిపడినంత, పసుపు-చిటికెడు, నీరు 1/2 కప్పు.

Juice therapy(జ్యూస్‌ థెరపీ)

ఈ థెరపీ వల్ల ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా ఒత్తిడిని ఎదుర్కొనే శక్తి వస్తుంది. ప్రతినెలా మూడు రోజుల చొప్పున దీన్ని ఆచరించడంవలన శరీరంలోని కణాల్ని శుభ్రపడతాయి. దీనిని ‘డి టాక్స్ జ్యూస్ ఫాస్టింగ్’ అని కూడా అంటారు.

Tuesday, 25 October 2016

pumpkin soup(గుమ్మడికాయ సూప్)

చాల మందికి గుమ్మడికాయతో చేసిన వంటలు నచ్చవు. కానీ గుమ్మడికాయలో 3చాల పోషక విలువలు ఉన్నాయి.  ముఖ్యంగా ఆడవారికి అవసరం అయిన  ఫోలిక్ ఆసిడ్ గుమ్మడిలో పుష్కలముగా ఉంటుంది. దీనిని ఆహారంలో తీసుకోటం చాల మంచిది. గుమ్మడికాయ కూరలా ఇష్టపడని వారికోసం మేము ఈ రోజు  గుమ్మడితో చేసే సూప్ తయారీ  విధానం చెప్పదలిచాము.


Quail eggs(పక్షి గుడ్ల వేపుడు)


కావల్సినవి :
పక్షి గుడ్లు (Quail eggs)- 12, ఉల్లిపాయలు - 1, ఉప్పు - తగినంత , పసుపు - చిటికెడు, కారం - 1 టీస్పూను .

Putnala pachadi, kobbari chutney(పుట్నాల కొబ్బరి పచ్చడి)


కావాల్సినవి :
పచ్చిమిర్చి - 5, పుట్నాలు - 1/2 కప్పు, కొబ్బరి ముక్కలు - 1 కప్పు, ఉప్పు - తగినంత , కొత్తిమీర -2 రెమ్మలు, నీళ్లు- 1/2 కప్పు.

Monday, 24 October 2016

Mixed vegetable curry(మిక్సీడ్ వెజిటబుల్ కర్రీ)


కావాల్సినవి:  బీన్స్ ముక్కలు- 1/2 కప్పు ,క్యాలీఫ్లవర్ ముక్కలు- 1 కప్పు, క్యారెట్ ముక్కలు- 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు -1/2 కప్పు, పచ్చి బఠాణి -1 కప్పు, సొరకాయ ముక్కలు -1/2 కప్పు, అల్లం- 1/2 అంగుళం, బంగాళాదుంప ముక్కలు -1/2 కప్పు, చిలకడదుంప ముక్కలు -1/2 కప్పు  ఉల్లిపాయ ముక్కలు- 1 కప్పు, పచ్చిమిర్చి-2, వెల్లుల్లి రెబ్బలు -3, టమాట ముక్కలు -1 పెద్ద కప్పు, ధనియాల పొడి -1 టీస్పూన్, గరంమసాలా -1 టీస్పూన్, జీలకర్ర -1/4 టీస్పూన్, లవంగాలు-4, దాల్చినచెక్క -2ముక్కలు, కొత్తిమీర -తగినంత, ఉప్పు- రుచికి సరిపడినంత, కారం- 1 టీస్పూన్. పచ్చికొబ్బరి -1టేబుల్ స్పూన్.

Friday, 21 October 2016

Palakura rice, palak rice, spinach rice(పాలకూర రైస్)కావాల్సినవి:
 పాలకూర ఆకులు -2 కప్పులు, ఉడికించిన అన్నం -1 కప్పు , పచ్చిమిర్చి -4, జీడిపప్పు - 10, నూనె- 2టేబుల్ స్పూన్స్, అల్లం,వెల్లుల్లి ముక్కలు-1 టీ  స్పూను చొప్పున, జీలకర్ర-1 టీస్పూను, ఎండుమిర్చి- 2, ఉల్లిపాయ -1, లవంగాయాలు -4, దాల్చిన చెక్క-1 చిన్న ముక్క, పచ్చిపప్పు-1 టీస్పూన్, కొత్తిమీర - కొంచెం, ఉప్పు- రుచికి సరిపడినంత.

Nimmakya pulihora, lemon rice(నిమ్మకాయ పులిహోర)

కావాల్సినవి:
బియ్యం - 1 కప్పు, నిమ్మకాయ - 1, పచ్చిమిర్చి - 2, ఉప్పు- తగినంత, పసుపు - 1/4 టీస్పూను, అల్లం - 1/4 అంగుళం, జీడిపప్పు- 10, పల్లీలు (సెనగకాయ పప్పులు) - 2 టేబుల్ స్పూన్లు, నూనె - 2 టేబుల్ స్పూన్లు.

vegetable pasta( వెజిటబుల్ పాస్తా)కావాల్సినవి: పాస్తా- 1కప్పు, ఉల్లిపాయ- 1, పచ్చిమిర్చి- 2, వెల్లుల్లి- 3 రెబ్బలు, క్యారెట్ - 1(చిన్నది ), క్యాప్సికం -1, పచ్చి బఠాణి - 1టేబుల్ స్పూను, స్వీట్ కార్న్ -1టేబుల్ స్పూను, ఆలివ్స్ -10, ఆలివ్ ఆయిల్- 1 టేబుల్ స్పూను ,పాస్తా సాస్- 2 టేబుల్ స్పూన్లు,గ్రేటెడ్ చీజ్- 1 స్పూను, ఉప్పు- తగినంత, ఒరిగానో - పావు స్పూను, బాసిలికం- చిటికెడు, చిల్లీ  ఫ్లేక్స్  -1/2 స్పూను.

Tuesday, 18 October 2016

Dondakaya pachadi(దొండకాయ పచ్చడి)


కావాల్సినవి:  దొండకాయలు- 1/2 కేజీ, పచ్చిమిర్చి- 7/8, వెల్లుల్లి రెబ్బలు- 3/4, దనియాలు-1 టీస్పూన్, పచ్చిపప్పు, మినప్పప్పు-2 టీస్పూన్స్ చొప్పున, చింతపండు- ఉసిరికాయంత, ఎండుమిర్చి-2.జీలకర్ర -1 టీ స్పూన్, పసుపు- పావు టీస్పూన్. ఉప్పు-తగినంత. కొత్తిమిర  - కొద్దిగ, నూనె- 3 టేబుల్ స్పూన్స్.

Health tips

 1. ఛాతి లో మంట  వస్తున్నప్పుడు అల్లం టీ తాగటం వలన ఉపశమనం ఉంటుంది. అలానే చిన్న బెల్లం ముక్క తిన్నా సరే. 
 2. అల్లం ముక్క చప్పరిస్తే వాంతులు నుండి ఉపశమనం ఉంటుంది. 
 3. ప్రతి రోజు 2 తులసి ఆకులు తినటం వలన కొలెస్ట్రాల్  అదుపులో ఉంటుంది. 

Carrot keera salad(క్యారెట్ కీరా సలాడ్)


కావాల్సినవి:
క్యారెట్ - 2, కిరా - 1 చిన్నది, ఉల్లిపాయ- 1 చిన్నది , నిమ్మరసం- 1/2 స్పూన్, ఉప్పు - తగినంత, కొత్తిమీర- 2 రెమ్మలు ,పుదీనా - 5 ఆకులు.

Mixed sprouts salad(మిక్స్డ్ స్ప్రౌట్స్ సలాడ్)


కావాల్సినవి :
మిక్స్డ్ స్ప్రౌట్స్ - 1 కప్పు , కిర ముక్కలు- 1/2 కప్పు, టమాటో- 1, ఉల్లిపాయ- 1 చిన్నది , నిమ్మరసం- 1/2 స్పూను , ఉప్పు - తగినంత, కొత్తిమీర- 2 రెమ్మలు ,పుదీనా - 5 ఆకులు, పచ్చిమిర్చి-1.

Raw mango salad(పచ్చిమామిడికాయ కిరాదోస సలాడ్)కావాల్సినవి :
పచ్చిమామిడికాయ- 1, కిరాదోస- 1 చిన్నది , పచ్చిమిరపకాయ- 1 చిన్నది, ఉప్పు- తగినంత, కొత్తిమీర - 2 రెమ్మలు

Monday, 17 October 2016

Carrot kheer(క్యారెట్ ఖీర్)కావాల్సినవి: క్యారెట్ - 3(పెద్దవి), మిల్క్-1 లీటరు ,పంచదార - 1 కప్పు , జీడిపప్పు-10, కిస్స్మిస్స్- 10, బాదం- 10, పిస్తాపప్పు- 10, యాలకులు -4.

Egg toast (ఎగ్ టోస్ట్)
కావాల్సినవి:  గుడ్లు- 2, మిరియాలపొడి - 1/4 టీ స్పూను, ఉప్పు- తగినంత, బ్రెడ్- 2, ఆలివ్ నూనె - 1స్పూను.  

Bread omelette (బ్రెడ్ ఆమ్లెట్)
కావాల్సినవి: గుడ్లు- 1, ఉల్లిపాయ- 1/2, పచ్చిమిర్చి -1 చిన్నది , ఉప్పు- తగినంత, నెయ్యి- 1 స్పూను , నూనె- 1 స్పూను , బ్రెడ్ -1

Sambar (సాంబార్)కావాల్సినవి:  కందిపప్పు - 1 టీ కప్(గిద్దె), చింతపండు- 1 నిమ్మకాయ అంత నీటి లో నానబెట్టాలి , టమాటో- 1, బంగాళాదుంప- 1, క్యారట్ -1, మునగకాయ -1, చిలకడదుంప -1, వంకాయ - 1, పచ్చిమిరపకాయ - 4,  ఉల్లిపాయ -1, బెండకాయ -3, కొత్తిమీర- 4 రెమ్మలు, సాంబారు పొడి- 2 టీ స్పూన్ల్స్ , కరం -1 స్పూన్, ఉప్పు- తగినంత, పాసుపు- చిటికెడు    
తాలింపుకొరకు:  నునే- 2 స్పూన్స్, ఆవాలు - 1/4 స్పూన్, జీలకర్ర - 1/4 స్పూన్, ఎండుమిరపకాయ- 2, కరివేపాకు - 2 రెమ్మలు, వెల్లులి- 3 రెబ్బలు, ఇంగువ- చిటికెడు
తయారీ : ముందుగా కుక్కర్ లో ఒక కప్పు కందిపప్పుకి 2 కప్పులు నీళ్లు పోసి మూడు విజిల్స్ వోచ్చేదాకా ఉంచాలి . ఒక మందపాటి గిన్నె తీస్కుని అంధులో కూరగాయ (బంగాళాదుంప, ఉల్లిపాయ, క్యారట్, మునగకాయ, చిలకడదుంప, వంకాయ, పచ్చిమిరపకాయ, బెండకాయ) ముక్కలు వేయాలి, ముక్కలు మునిగేదాక నీళ్లు పోసి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన ముక్కల్లో ముందుగా  మెత్తగా ఉడికికించుకున్న పప్పు,టొమాటోలు మరియు చింతపండు పులుసు వేసి ఒకసారి కలయబెట్టాలి. తరువాత అందులో ఉప్పు,కారం,సాంబార్ పొడి, చిటికెడు పసుపు మరియు కొత్తిమీర వేసి 15 నిమిషాలు మరిగించాలి తరువాత చిన్న కడయిలో నూనె పోసి తాలింపు సామాను వెయ్యాలి,అవి చిటపటలాడాక కరివేపాకు మరియు కచ్చాపచ్చాగా దంచిన వెల్లులి రెబ్బలను వేసి ఒక నిమిషం వేగించి మరిగించిన మిశ్రమంలో కలుపుకోవాలి.    .       

         
      

Beans fry (బీన్స్ ఫ్రై)కావాల్సినవి:
 సన్నగా తరిగిన బీన్స్-1/2 కేజీ, ఉల్లిపాయ ముక్కలు -1చిన్న కప్పు , పచ్చిమిర్చి-3, పచ్చికొబ్బరి తురుము -2 టేబుల్ స్పూనులు ,కొత్తిమీర తగినంత ,కారం -2 టీస్పూన్స్, ఉప్పు- తగినంత .


తాలింపుకొరకు:  నూనె-2 టేబుల్ స్పూనులు, ఆవాలు-1/2 టీ స్పూను, పచ్చిపప్పు-1 టీస్పూను, పసుపు- 1/4 టీ స్పూను, ఎండుమిర్చి-1, జీలకర్ర- 1టీస్పూను, కరివేపాకు-2 రెమ్మలు, వెల్లుల్లి- 3 రెబ్బలు.


తయారీ:  ముందుగా కడాయి స్టవ్ మీద పెట్టుకుని నూనె పోసి వేడి చెయ్యాలి. నూనె వేడి అయ్యాక ఆవాలు వేసి అవి చిటపటలాడాక  పచ్చిపప్పు, కరివేపాకు, జీలకర్ర ,ఎండు మిర్చి, పసుపు మరియు వెల్లుల్లిని దంచి వేసి పప్పు ఎర్రగా అయ్యే వరకు వేయించాలి.


ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు వేయించిన తరువాత బీన్స్ ముక్కలు కూడా వేసి కొంచెం ఉప్పు చల్లి కలిపి మూతపెట్టి 10 నిమిషాలు మీడియం మంట మీద వేయించాలి. ముక్క కొంచెం మెత్తబడ్డాక మూత తీసి మరో 5 నిమిషాలు వేయించి పచ్చికొబ్బరి తురుము ,కారం పొడి చల్లి మరో 5 నిమిషాలు వేయించి, కొత్తిమీర చల్లి స్టవ్ మీద నుండి దించి వెయ్యాలి. టమాటో రసం తో బీన్స్ ఫ్రై నంజుకుని తింటే చాల రుచిగా ఉంటుంది.
Sunday, 16 October 2016

Barbecue nation Review


 బార్బెక్యూ నేషన్ రెస్టారెంట్ యొక్క విశేషాలు మీకు తెలియపరచదలిచాం .ఇది సయాజీ హోటల్స్ వారి రెస్టారెంట్ ,దీని యొక్క బ్రాంచీలు భారత దేశం లో ఉన్న అన్ని ముఖ్య రాజధాని నగరాల్లో విస్తరించి ఉన్నవి. ఈ రెస్టారెంట్ పేరులోనే ఉంది ఇక్కడేం స్పెషలో, అవునండి బార్బెక్యూ ఐటమ్స్ వీరి ప్రత్యేకత. ఇక్కడ బఫెట్ మాత్రమే దొరుకుతుంది ,మీరు తినగలగాలే కానీ చెప్పలేనన్ని వైరిటీలు సర్వ్ చేస్తారు. రెస్టారెంట్ లోకి అడుగుపెట్టగానే వెయిటర్ మేము రిజర్వు చేసుకున్న టేబుల్ చూపించాడు. తరువాత సర్వర్ వొచ్చి మేము శాకాహారులమో లేక మాంసాహారులమో అడిగి ఈరోజా  ఏదైనా ప్రత్యమైన రోజా అని  తెలుసుకున్నాడు , అదేనండి మీ పెళ్లిరోజు లేక పుట్టినరోజా అన్న వివరాలు అడుగుతారు . తర్వాత బొగ్గుల కుంపటిని తీస్కుని వచ్చి మన ముందు పెడతారు, మాంసాహారులకి చికెన్, మటన్, ఫిష్ , రొయ్యలని రకరకాల మసాలాలతో మ్యారినేట్ చేసి వాటిని కొద్దిగా కాల్చి ఒక ఇనుప చువ్వకు గుచ్చి(స్కువెర్స్) మన ముందు ఉన్న బొగ్గుల కుంపటి పైన పెడతారు.  శాకాహారులకి రక రకాల పండ్లు, కూరగాయ ముక్కలు మరియు పనీర్ ని చువ్వకు గుచ్చి బొగ్గుల కుంపటి మీద ఉంచుతారు . వాటి మీద మన టేబుల్ ఫై ఉన్నరకరకాల సాస్లని అక్కడ ఉన్న బ్రెష్ తో పూసి ఇనుపచువ్వని తిప్పుతూ కాల్చుకోని తినాలి. ఇవే కాకుండా మనకి రకరకాల స్టాటర్లని సర్వ్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉందండి, మన ముందు జెండా లాగా ఉండే ఇత్తడి వస్తువుని ఉంచుతారు,  జెండా ఎగురుతున్నట్లుగా ఉంటె మన ముందు స్టార్టర్లు ప్రత్యక్షమవుతూనే ఉంటాయి. జెండా దింపినట్లుగా ఉంటే స్టార్టర్లు సర్వ్ చేయడం ఆపేస్తారు  .


ఇక్కడ బార్బెక్యూ ఐటమ్స్ తో పాటు రక రకాల సలాడ్స్, సూపులు, బిర్యానీలు, కర్రీలు, నూడుల్స్, రోటీలు, స్వీట్లు ,కేకులు, ఐస్క్రీమ్ లు మరియు కుల్ఫీలు దొరుకుతాయి. అన్ని మీరు ఎంత తినగలిగితే అంత తినొచ్చు. మీ బర్త్ డే లేక పెళ్లిరోజున వెళ్తే వారు మీకోసం ఒక కేక్ కాంప్లిమెంటరీ (ఫ్రీ )గా  తెచ్చి కోయమనడమే కాకుండా మీ టేబుల్ ముందు సర్వర్లు అందరు డాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ తమదైన స్టైల్ లో విష్ చేస్తారు. ఆ రోజు మా ఫ్రెండ్ పుట్టినరోజు వాళ్ళు అలా మా టేబుల్ ముందు డాన్స్ చేస్తుంటే మొహమాటంగా అనిపించినా ఇది ఒక కొత్త అనుభూతి అనుకున్నాం.    
మా రివ్యూ:
 • రేటింగ్ : 9/10
 • రికమెండ్ చేయదగిన ఐటమ్స్: ఫ్రైడ్ కార్న్, స్పైసి పొటాటో, మటన్ కబాబ్, గ్రిల్ ఐటమ్స్ ,బిర్యానీ, పేస్ట్రీ లు , కుల్ఫీలు       
 •  ధర: 1400-1800 రూపాయలు (ఇద్దరికి) 
 • బుకింగ్ : అవసరం 
 •  బెస్ట్ టైం : మధ్యాహ్నం ( బఫెట్ రేట్ తక్కువగా ఉంటుంది )


Potato fry (బంగాళాదుంప వేపుడు)

ఈజీ కూరలలో మనకి ముందు గుర్తొచ్చేది బంగాళాదుంప వేపుడు, ఇది వండడానికి తేలికగా ఉండడమే కాకుండా రుచిగా కూడా ఉంటుంది. 

                                       

కావాల్సినవి :
బంగాళాదుంపలు- 1/2 కేజీ, కరివేపాకు- 2 రెమ్మలు, ఉప్పు- తగినంత , కరం- 1 స్పూను, ధనియాల పొడి - 1 స్పూను, పసుపు - చిటికెడు, ఇంగువ - చిటికెడు, నూనె - 3 స్పూన్లు 


తయారీ :  ముందుగా బంగాళాదుంపల్ని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. నాన్ స్టిక్ పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి నూనె పొయ్యాలి. నూనె వేడెక్కాక ఇంగువ మరియు కరివేపాకు  వేస్కోవాలి. కరివేపాకు  చిటపటలాడాక బంగాళాదుంప ముక్కలు వేసుకోవాలి . 


తర్వాత పసుపు ,కారం ,ఉప్పు మరియు ధనియాలపొడి వేసి ముక్కలు బంగారురంగు వచ్చేవరకు వేపుకోవాలి. అప్పుడప్పుడు ముక్కల్ని గరిటతో తిప్పడం మాత్రం మర్చిపోకండి. ముక్క ఉడికిందో లేదో చూడడానికి ఒకసారి గరిటతో ముక్కని పొడిచి చూడండి ,ముక్క మెత్తగా ఉంటె ఉడికినట్లు. లేదంటే ఇంకో 3 నిమిషాలు వేపుకోవాలి. అంతే అండి తేలికైన మరియు రుచికరమైన బంగాళాదుంప ఫ్రై రెడీ.        

                 

Tips for spotless skin

 1.  ఒక స్పూన్ నిమ్మరసంలో 1/2 స్పూన్ తేనె కలిపి నల్లని మచ్చలు ఉన్న ప్రదేశములో రాసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా 1 నెల పాటు చేస్తే మచ్చలు తగ్గిపోతాయి.
 2. 1 స్పూన్ పాలలో చిటికెడు పసుపు మరియు టమాటో రసం వేసి బాగా కలిపి నల్ల మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి 15 నిమిషాలు ఆగి చల్లని నీటి తో కడిగేయాలి .ఇలా ప్రతి రోజు చేస్తే మచ్చలు మరియు నలుపు కూడా తగ్గి, చర్మ ఛాయ కూడా మెరుగు పడుతుంది. 
 3.  బంగాళాదుంప రసం తీసి నల్ల మచ్చల పైన ప్రతి రోజు రాయటం వలన కూడా నలుపు క్రమముగా తగ్గిపోతుంది. 
 4.  1 స్పూన్ పెరుగులో 1 స్పూన్ నిమ్మరసం, కొంచెం పసుపు వేసి బాగా కలిపి ప్రతి రోజు మచ్చలు ఉన్న ప్రదేశంలో రాయుట వలన చర్మం నలుపు తగ్గి, మచ్చలు మటుమాయం అయిపొతాయి. 
 5.  1- టీస్పూన్ చందనం పౌడర్ తీసుకుని దానిలో రోజ్ వాటర్ కలిపి పేస్ట్  చేసుకోవాలి .ఆ పేస్ట్ ని  నల్లమచ్చలు ఉన్న చోట రాసి ఆరిపోయాక చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయటం వలన మచ్చలు తగ్గిపోయి, ముఖం నునుపుగా తయారు అవుతుంది. 

(Innsbruck,(Austria) travel info)

పచ్చని ప్రకృతి, చెక్క గృహములు మరియు మంచు శిఖరాల మధ్య ఉన్నటువంటి ఇన్స్బర్క్ నగర విశేషాలని మీకు ఈరోజు చెప్పదలిచాము. ఇన్స్బర్క్ నగరం ఆస్ట్రియా దేశములోని టైరోల్ రాష్ట్రమునకు రాజధాని. మేము జర్మనీలో ఉన్న స్టుట్గార్ట్ నగరము నుండి 4.30 గంటలు కారులో ప్రయాణము చేసి ఇన్స్బర్క్ కి చేరుకున్నాము.


 హోటల్లో బస కాకుండా ఫెరియెన్ ఒణున్గ్ అని పిలవబడే అద్దె గృహములను నెల ముందు బుక్ చేసుకున్నాము. ఈ గృహముల నిర్వహణ అంతా గృహ యజమానులు చూసుకుంటారు.. ఇన్స్బర్క్ కి పక్కన ఉన్న పల్లెటూరిలో మా వసతి గృహము ఉన్నది .ఆ ఇంటిని ఇద్దరు వృద్ధ దంపతులు చూసుకుంటున్నారు. వారు ఇంటిని చాలా శుభ్రంగా ఉంచడమే కాకుండా అందంగా కూడా అలంకరించారు. ఆ గృహములలో వంట గది మరియు వంట పాత్రలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇంటి భోజనం కావాలనుకునేవారు వంట చేసుకోవచ్చు. ఇంటి వెనుక పంట పొలములు, మరో వైపు మంచు కొండలు ఎటు చూసిన అందమైన ప్రకృతితో మా మనసుకు ఆహ్లాదకరంగా అనిపించింది. మా పడకగది కిటికీ నుండి మంచుకొండలు దగ్గరగా కనిపిస్తూ సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయాలలో  కన్నుల విందు చేసాయి.


చలికాలములో ఈ ప్రదేశము అంతా  మంచుతో కప్పబడి స్కీయింగ్(మంచు మీద జారే ఆట) కి అనువుగా ఉండటం వలన ఎక్కువ మంది ఆ సమయములో సందర్శిస్తారు. మేము ఇన్స్బర్క్ నగరంలో ప్రముఖ ప్రదేశాలని చూడదలచి కారులో బయలుదేరి మొదటగా టిరోల్ అనే ప్రదేశమునకు చేరుకున్నాం. అక్కడి నుండి కేబుల్ కారు సహాయముతో కొండ మీదకు చేరుకున్నాము. కొండ మీద 2 కిలోమీటరులు నడిచి కొండ చివరి వరకు చేరుకున్నాం. చుట్టూ కొండలు, మధ్యలో లోయ అద్భుతంగా అనిపించింది. కొండ మీద ఎక్కడ చూసిన గడ్డిచామంతి పూలు ఉండడం వలన పసుపు రంగు తివాచి పరిచినట్టుగా అనిపించింది.

టిరోల్ 
 కొండ మీద తేనటీగలు పెంచే పరిశ్రమలు ఉన్నాయి. పువ్వులు ఎక్కువగా ఉండటం వలన తేనేటీగలు మకరందాన్ని సేకరిస్తూ కొండ అంతా కనిపించాయి. అందువలన ఎవరు ఆ పువ్వుల మీద నడవటం కానీ ఆ తేనేటీగలని చంపటంగాని చేయకూడదు అని అక్కడ బోర్డు పెట్టారు. మేము ఆ కొండ మీద ఉన్న ఒక రెస్టారెంట్లో బ్రేడ్ ,చీజ్ తో   చేసిన టోస్ట్ మరియు  బంగాళ దుంపతో చేసే పొమ్మెస్ (ఫ్రైస్) తిన్నాము. తరువాత ఇన్స్బర్క్ సిటీలోని ఓల్డ్ టౌన్ లో వున్న డాచిల్  అని పిలవబడే ప్రదేశానికి వెళ్ళాము. అది మొత్తము రాగితో తాపడం చేయబడి చిన్నవసారలా ఉంది.. పండగ సమయాలలో  చేసే సంబరాలు అన్నీ ఇక్కడినుండే ప్రాంభమవుతాయట.
 గోల్డెన్స్ డాచిల్ 
తర్వాత బగ్గేర్సీ లేక్, హెర్జ్సీ లేక్ మరియు కుణ్డలే జార్జి అనే ప్రాంతాలను సందర్శించాము. హెర్జ్సీ లేక్ లో బోట్ రైడింగ్ అనుమతి ఉండటం వలన మేము ఒక పెద్దల బోట్ అద్దెకు తీసుకుని లేక్ అంతా బోటింగ్ చేస్తూ సరదాగా గడిపాము. అక్కడ చాల మంది ఉల్లాసంగా ఈత కొడుతూ ఆనందిస్తున్నారు ,చిన్న పిల్లలు కూడా ఏ మాత్రమూ భయపడకుండా ఈత కొట్టటం చూసి మాకు చాల ఆశ్చర్యము వేసింది.

హెర్జ్సీ లేక్ 

ఈ ప్రయాణంలో దారి పొడవునా మాకు చిన్న చిన్న పిల్ల కాలువలు కనువిందు చేసాయి .మహిళలకి ఎంతో ఇష్టమైన స్వరోస్కి నగలు పుట్టినది ఈ ఇన్స్బర్క్ నగరంలోనే, స్వరోస్కి రాళ్లు ప్రపంచము అంతా ప్రఖ్యాతిగాంచాయి. ఇక్కడ స్వరోస్కి మ్యూజియం ఉంది, అందులో రకరకాల క్రిస్టల్స్ తో చేసిన శిల్పాలు కనువిందుచేసాయే.

స్వరోస్కి మ్యూజియం 

 ఆ మ్యూజియంలో  ఉన్న దుకాణంలో మేముకూడా కొన్ని స్వరోస్కి రాళ్ళని మరియు నగలను కొనుగోలు చేసాము. ప్రకృతిలో సేద తీరాలి అనుకునే వాళ్ళకి ఈ నగరం ఎంతగానో ఆకట్టుకుంటుంది అనటంలో సందేహం లేదు. మేము కూడా చక్కటి అనుభూతలను మూట కట్టుకుని తిరుగు ప్రయాణం అయ్యాము .