Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Tuesday 7 March 2017

Bangaladumpa tomato curry/Potato tomato curry/Aloo tomato curry(బంగాళాదుంప టమాటా కూర)


కావాల్సినవి
  • సన్నగా తరిగిన దుంపలు-1 కప్పు,
  • టమాటాలు-1 కప్పు,
  • పచ్చి మిర్చి-2,
  • గరం మసాలా-1/2 టీస్పూన్,
  • నూనె-3 టేబుల్ స్పూన్స్,
  • ఆవాలు-3/4 టీస్పూన్,
  • ఎండు మిర్చి-2,
  • జీలకర్ర-1/2 టీస్పూన్, 
  • పచ్చి సెనగ పప్పు-1/2 టీస్పూన్,
  • ఉల్లిపాయ-1,
  • అల్లంవెల్లుల్లి ముద్ద -1 టీస్పూన్ ,
  • కరివేపాకు-2రెమ్మలు,
  • ఉప్పు-తగినంత,
  • కారం-1 టీస్పూన్.
తయారీ:
స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చి సెనగ పప్పు, కరివేపాకు, ఎండు మిర్చి వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు ,పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి 2 నిమిషాలు వేయించుకుని బంగాళాదుంప ముక్కలు వేసుకోవాలి .



ఉప్పు చల్లి మూత  పెట్టుకుని 3 నిమిషాలు మగ్గించుకున్న తరువాత టమాటా ముక్కలు, కారం, గరం మసాలా వేసి కలిపి ,ఒక కప్పు నీరు పోసుకుని 10 నిమిషాలు కూర దగ్గరికి పడే వరకు ఉడికించుకోవాలి. అంతే బంగాళాదుంప టమాటా కూర సిద్ధం.


ఈ కూర అన్నం,చపాతీ, రోటీలోకి రుచిగా ఉంటుంది. 

No comments:

Post a Comment