Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Tuesday 13 December 2016

palakura pappu(పాలకూర పప్పు)

9

కావాల్సినవి: సన్నగా తరిగిన పాలకూర-1 పెద్ద కప్పు(1 కట్ట), పచ్చిమిర్చి-3, కందిపప్పు-1 చిన్న కప్పు(గిద్ద ), టమాటా-1(లేకపోయినా పర్లేదు), చింతపండు-పెద్ద ఉసిరికాయ అంత, ఉప్పు-తగినంత, కొత్తిమీర -కొద్దిగా, కారం-1 టేబుల్ స్పూన్.

తాలింపుకొరకు: నూనె-2 టేబుల్ స్పూన్స్, ఆవాలు-1/4 టీస్పూన్, మినపప్పు,పచ్చిపప్పు-1 టీస్పూన్ చొప్పున, ఎండు మిర్చి-1, ఇంగువ-చిటికెడు, పసుపు-1/4 టీస్పూన్, జీలకర్ర-1/4 టీస్పూన్, కరివేపాకు-2 రెమ్మలు, వెల్లుల్లి-2/3, పెద్ద ఉల్లిపాయ-1/2, ఇంగువ- చిటికెడు.


తయారీ: కుక్కర్ లో కందిపప్పు వేసి శుభ్రంగా కడిగి ఒక పెద్ద గ్లాసు నీరు పోయాలి. దానిలో సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర ఆకులు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు, కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి పోయే వరకు పక్కన పెట్టుకోవాలి.


తరువాత కడాయి స్టవ్ మీద పెట్టుకుని నూనె వేసి, వేడి అయ్యాక ఆవాలు, పచ్చి సెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ , పసుపు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఈ  మిశ్రమాన్ని ముందుగా ఉడికించి మెదిపి పెట్టుకున్న పప్పులో వేసి కారం, కొత్తిమీర వేసి బాగా కలుపుకుని ఉప్పు సరి చూసుకుని 5 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి తీసుకుని వడ్డించుకోవాలి. ఈ పప్పు అన్నం,చపాతీ,రోటి లోకి బాగుంటుంది.

No comments:

Post a Comment