Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Tuesday 13 December 2016

vankaya tamato kura(వంకాయ టమాటా కూర)


కావాల్సినవి: వంకాయ - 1/4 కేజీ (6 వంకాయలు), టమాటా -3, పచ్చిమిర్చి -3, పసుపు -1/4 టీస్పూన్ ,ఉప్పు -1/2 టీస్పూన్ (తగినంత), కారం -1/2 టీస్పూన్, ఉలికిపాయ- 1, కొత్తిమీర -2 రెమ్మలు.

తాలింపు కొరకు:నూనె-2 టేబుల్ స్పూన్స్, ఆవాలు-1/4 టీస్పూన్, మినపప్పు,పచ్చిపప్పు-1 టీస్పూన్ చొప్పున, ఎండు మిర్చి-1, ఇంగువ-చిటికెడు, పసుపు-1/4 టీస్పూన్, జీలకర్ర-1/4 టీస్పూన్, కరివేపాకు-2 రెమ్మలు, వెల్లుల్లి-2/3, పెద్ద ఉల్లిపాయ-1/2, ఇంగువ- చిటికెడు.



తయారీ:  ముందుగా కడాయి స్టవ్ మీద పెట్టుకుని నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు సామాను వేసుకుని అవి చిటపటలాడిన తరవాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి మరియు వంకాయ ముక్కలని వేసి 5 నిమిషాలు వేయించుకోవాలి. 



తరువాత టమాటో ముక్కలు, ఉప్పు, పసుపు మరియు కారం వేసి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత ఒక కప్పు నీళ్లు పోసి దగ్గరగా అయ్యేవరకు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోడమే. ఈ కూర అన్నంలోకి లేదా చపాతీ లోకి బాగుంటుంది.          
  

No comments:

Post a Comment