Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Monday 2 January 2017

Vankaya senagapappu kura(వంకాయ సెనగపప్పు మసాలా కూర)


కావాల్సినవి :వంకాయ ముక్కలు- 1 కప్పు (కోసి ఉప్పు నీటిలో వేసుకోవాలి), పచ్చి కొబ్బరి తురుము -3 టేబుల్ స్పూన్స్, ఉల్లిపాయ-1, పచ్చిమిర్చి-2, నాన పెట్టుకున్న పచ్చిపప్పు-1/2 కప్పు, టమాటా ముక్కలు-1 కప్పు, గరం మసాలా-1 టీస్పూన్, అల్లంవెల్లుల్లి ముద్ద-1 టేబుల్ స్పూన్, ధనియాలపొడి-1/2 టీస్పూన్, కారం - 1 టీస్పూన్, ఆవాలు-1/4 టీస్పూన్, జీలకర్ర-1/2 టీస్పూన్, కరివేపాకు-2 రెమ్మలు, ఉప్పు-తగినంత, పసుపు-1/4 టీస్పూన్, కొత్తిమీర-కొద్దిగా, నూనె-2 టేబుల్ స్పూన్స్.


తయారీ :ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి 2 నిమిషాలు పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తరువాత పచ్చి పప్పు వేసి ముత  పెట్టి తక్కువ మంట మీద 3 నిమిషాలు మగ్గించుకోని ,టమాటా ముక్కలు కూడా వేసి మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి.


దీనిలో గరం మసాలా, ధనియాల పొడి, కారం వేసి కలపాలి. వంకాయ ముక్కలు వేసి కలయపెట్టి ఉప్పు చల్లి 3 నిమిషాలు మగ్గించుకుని, ముక్కలు మునిగే వరకు నీరు పోసి మూత పెట్టి 10 నిమిషాలు కూర దగ్గరికి పడే వరకు ఉడికించుకోవాలి. చివరగా పచ్చి కొబ్బరి, కొత్తిమీర వేసి కలిపి మరో 5 నిమిషాలు ఉడికించి సెర్వింగ్ బౌల్ లోకి తీసుకుని వడ్డించుకోవాలి. అంతే వంకాయ పచ్చిపప్పు కూర సిద్ధం. మసాలా సరిపడా వేసుకుంటే ఈ  కూర చాల రుచిగా ఉంటుంది. అన్నం,చపాతీ,రోటీలోకి ఈ  కూర బాగుంటుంది. 

No comments:

Post a Comment