Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Monday 9 January 2017

Paneer tikka masala(పనీర్ టిక్కా మసాలా)


కావాల్సినవి: పనీరు ముక్కలు-1 కప్పు, పెద్ద ఉల్లిపాయ-1, టమాటా ముక్కలు-1 కప్పు, గరం మసాలా-1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి-1 టీస్పూన్, కారం-1 టీస్పూన్, బటర్-2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర-1 టీస్పూన్, నూనె-1 టేబుల్ స్పూన్, గ్రీన్ కాప్సికం - 1/2 ముక్క, రెడ్ కాప్సికం - 1/2 ముక్క, కొత్తిమీర-కొద్దిగా, కసూరి మేతి-కొద్దిగా, ఉప్పు-తగినంత, అల్లం వెల్లుల్లి ముద్ద-1 టేబుల్ స్పూన్.


తయారీ: ముందుగా కడాయిలో బటర్ ,నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాలు వేయించి, తరువాత టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యాక గరం మసాలా, ధనియాల పొడి, కారం వేసి కలిపి క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయే పెద్ద ముక్కలు వేసి ఉప్పు చల్లి 5 నిమిషాలు మగ్గించాక, పనీర్ ముక్కలు కూడా వేసి కలిపి మరో 5 నిమిషాలు మగ్గించుకోవాలి. చివరగా కసూరి మేతి పొడి వేసికొని కలిపి సెర్వింగ్ బౌల్ లోకి  తీసుకుని వడ్డించుకోవాలి.     


గమనిక:ఉల్లిపాయని సగానికి కోసుకొని ఒక సగం సన్న ముక్కలు కోసుకోవాలి, మరో సగం పాయలుగా విడ తీసి కూరలో వేసుకోండి మరియు కాప్సికం కూడా పెద్ద ముక్కలు కోసుకుంటే తినేటప్పుడు బాగుంటాయి.


No comments:

Post a Comment