Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Monday 9 January 2017

Coconut pulav(కొబ్బరి పాల పలావ్)


కావాల్సినవి :బాస్మతి బియ్యం -1 గ్లాసు ,కొబ్బరి పాలు -1 కప్పు ,ఉప్పు -తగినంత (1 టీస్పూన్), పచ్చిమిర్చి -4, బంగాళాదుంప -1, క్యారెట్ -1, పచ్చి బఠాణి- 3 టేబుల్ స్పూన్లు ,క్యాలీఫ్లవర్ ముక్కలు -10, ఉల్లిపాయ-1, అల్లం వెల్లులి -2 టీస్పూన్లు ,చెక్క -2 ఇంచులు ,లవంగాలు -7, యాలకలు-5, జాజికాయ-1 ,జవిత్రి -1, పలావ్ ఆకు -3, జీలకర్ర- 1/2 టీస్పూన్, కొత్తిమీర -3 రెమ్మలు ,పుదీనా -3 రెమ్మలు ,జీడిపప్పు -10, నెయ్యి -3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా -1 టీస్పూన్ .


తయారీ : రైస్ కుక్కర్ గిన్నె లేక కుక్కర్ లో నెయ్యి వేసి చెక్క ,లవంగాలు, యాలకలు, జాజికాయ ,జవిత్రి, పలావ్ ఆకు మరియు జీలకర్ర వేసి ఒక నిమిషం వేపి తరిగిన ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి వేసి 1 నిమిషం వేపాలి. తరవాత తరిగిన బంగాళాదుంప, క్యారెట్, పచ్చి బఠాణి ,క్యాలీఫ్లవర్ ముక్కలు మరియు అల్లంవెల్లులి పేస్ట్ వేసి 5 నిమిషాలు పచ్చి వాసన పోయేవరకు వేపుకోవాలి.


తరువాత కొబ్బరిపాలు మరియు బియ్యం వేసి ఒకసారి కలియబెట్టి ఒకటిన్నర గ్లాసుల నీళ్లు పోసి ఉప్పు మరియు పసుపు వేసి ఒకసారి ఉప్పు సరిచూసుకుని గరంమసాలా వేసి జీడిపప్పు ,పుదీనా మరియు కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేవారుకూ ఉంచి సర్వ్ చేసుకోడమే . ఇది ఏదైనా మసాలా కూరతో రుచిగా ఉంటుంది.     

No comments:

Post a Comment