Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Thursday 10 November 2016

tips for dry skin( పొడి చర్మం ఉన్న వారి కొరకు చిట్కాలు)

1.  1 టేబుల్ స్పూన్ బాదం పొడిలో 2 టేబుల్ స్పూన్స్ పచ్చిపాలు కలుపుకుని పేస్ట్ లా చేసుకుని ముఖానికి   రాసుకోని ,10 నిమిషాలు తరువాత  వేళ్ళతో మృదువుగా మసాజ్ చేసుకుని చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే    చెర్మం మృదువుగా మారుతుంది.

2. కోడి గుడ్డు పచ్చ సోనలో 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని బాగా కలుపుకుని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉండటం వలన చర్మం మెత్తగా, కాంతివంతముగా అవుతుంది. 

3. 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసంలో 1 టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలిపి ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీని వలన చర్మం పొడి బారకుండా ఉండి దురద, మంట తగ్గుతుంది. 

4. బాగా పండిన అరటిపండుని గుజ్జులా చేసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ తేనె వేసుకుని కలిపి ముఖానికి రాసుకుని 15 నిమిషాలు తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీని వలన చెర్మం తేమగా, కాంతివంతంగా కనిపిస్తుంది. 

No comments:

Post a Comment