Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Wednesday, 23 November 2016

aloo parata(ఆలూ పరాట)


కావాల్సినవి: ఉడికించిన బంగాళాదుంపలు- 4, సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు- 1/2 కప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి-2, గోధుమ పిండి-1 కప్పు, కారం-1 టీస్పూన్, చాట్ మసాలా-1 టీస్పూన్, ఆంచూర్ పొడి -1/2 టీస్పూన్. నెయ్యి/నూనె -తగినంత, కొత్తిమీర -తగినంత, జీలకర్ర  పొడి-1/2 టీస్పూన్ ,ధనియాల పొడి-1/2 టీ స్పూన్.



తయారీ: ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండి, కొంచెం ఉప్పు, నూనె వేసి మెత్తగా చపాతీ పిండిలా కలుపుకుని  పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి 3 నిమిషాలు మగ్గనిచ్చి, దానిలో జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా, ఆంచూర్ పొడి వేసి 1 నిమిషం వేయించి బంగాళాదుంపలను చిదుముకుని వేసి ,ఉప్పు, కారం వేసి అన్ని కలిసేట్టు కలుపుకోవాలి . ఈ మిశ్రమాన్నీ మెత్తగా గుజ్జులా మెదుపుకోని చల్లారనివ్వాలి. తరువాత గోధుమ పిండి ముద్దని తీసుకుని చివరలు పలుచగా మధ్యలో మందంగా ఉండేట్టు గుండ్రంగా వత్తుకోవాలి .


ఇలా వత్తుకున్న చపాతీ మధ్యలో బంగాళాదుంప మిశ్రమాన్నీ ఉంచి మూసివెయ్యాలి. తరువాత చపాతీ కర్రతో వత్తుతు లోపల పెట్టిన మిశ్రమం బయటికి రాకుండా సమంగా ఉండేట్టు నెమ్మదిగా గుండ్రంగా చేసుకోవాలి. పిండి అంటుకోకుండా ఉండాలి అంటే పొడి గోధుమపిండి చల్లుకుంటూ ఉండండి. ఇలా తయారు అయిన పరాటాలని పెనం మీద నెయ్యి వేసి రెండు వేపులా మీడియం మంట  మీద కాల్చుకొని  తీసుకోవాలి. అంతే వేడి వేడి ఆలూ పరాట సిద్ధం .


గమనిక: బంగాళ దుంపలని ఉడికించాక తురుముకుని గాని లేదా చాక్ తో సన్నగా తురుగుకొనికానీ ఉపయాగించుకోండి. ఎందుకంటే దుంప ముక్కలు తగులుతూ ఉంటె పరాట సరిగా రాదూ. అలానే ఉల్లిపాయ ,మిర్చి ముక్కలు బాగా సన్నగా తరుగుకోండి. మామిడి  పొడి లేని వాళ్ళు చాట్ మసాలా ఒక్కటే ఉపయోగించిన చాలు. లేదా కూరలో  కొంచెం నిమ్మకాయ రసం  పిండుకొండి .  

             

1 comment:

  1. Discover a premium collection of Panchgavya-based wellness, herbal cosmetics, natural Gomay products, and everyday FMCG essentials, all crafted with the purity of traditional Indian wisdom. At Deendayalkamdhenu, we bring to you the finest range of Ayurvedic and cow-based products that promote health, sustainability, and conscious living.

    💼 बिज़नेस का सुनहरा मौका – हमारे साथ जुड़ें!
    अब आप भी बन सकते हैं हमारे [पंचगव्य उत्पाद] के ऑफिशियल डीलर।
    ✅ कम निवेश, ज्यादा मुनाफा
    ✅ सपोर्ट + ट्रेनिंग उपलब्ध
    ✅ WhatsApp और कॉल से ऑर्डर सुविधा
    ✅ फास्ट डिलीवरी और सटीक सप्लाई
    ✅ ऑनलाइन और डिजिटल पेमेंट सपोर्ट
    ✅ ट्रस्टेड और रिजल्ट वाले प्रोडक्ट्स

    📞 संपर्क करें: [9520890088]
    🛍 Visit करें आज ही और पाएं खास ऑफर!
    Shop Now - www.deendayalkamdhenu.com
    📍 पता: [Deendayal Dham (Nagla Chandrabhan) Farah Mathura 281122]

    ReplyDelete