Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Friday 4 November 2016

Cooking tips(వంటింటి చిట్కాలు)

    1. వేపుడు కూరలు దించేముందు కొంచెం సెనగపిండి పైన చల్లి కలిపిదించితే మంచి రుచిగా ఉంటుంది. 
    2. పాలు కాచేటప్పుడు కొంచెం తినే సోడా వేస్తే పాలు విరగవు. 
    3. మజ్జిగ చాలకపోతే గోరువెచ్చని పాలలో నిమ్మరసం పిండితే అది మజ్జిగలా తయారవుతుంది. 
    4. పూరి పిండి కలిపేటపుడు కొంచెం చెక్కర కలిపితే పూరీలు చాలాసేపు తాజాగా ఉంటుంది. 
    5. పప్పులు గానీ బియ్యంగాని అర్జెంటుగా నానబెట్టాలి అంటే వేడినీళ్ళలో నానబోస్తే మంచిది. 
    6. పకోడీల పిండిలో కొంచెం వేడినూనె కలిపితే పకోడీలు కారకరలాడుతాయి. 
    7. అన్నం ఉడికేటపుడు అందులో రెండు లేక మూడు చుక్కలు నిమ్మరసం పిండితే అన్నం తెల్లగా మల్లెపువ్వులా ఉంటుంది. 
    8. కూరగాయ ముక్కలని పసుపు కలిపినా నీటిలో ఉంచితే ఏమైనా క్రిములు ఉంటే అవి పైకి తేలిపోతాయి. 
    9. గుడ్లని ఉప్పు నీటిలో ఉడికిస్తే పెంకులు తేలికగా వస్తాయి.            

No comments:

Post a Comment