Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Monday 7 November 2016

Liver fry / Andhra style chicken liver fry(చికెన్ లివర్ ఫ్రై)


కావాల్సినవి: చికెన్ లివర్ -250 గ్రాములు, పసుపు - 1/4 స్పూన్, ఉప్పు- తగినంత (1/2 స్పూన్), కారం -1 టీస్పూన్ ,ఉల్లిపాయ -1, నూనె - 2 టేబుల్ స్పూన్, నిమ్మకాయ రసం -1/2 స్పూన్.

మాసాలా :  కొబ్బెరి ముక్కలు -2 టేబుల్ స్పూన్లు, ధనియాలు -1 టేబుల్ స్పూన్, లవంగాలు -4, చెక్క -1 అంగుళం ,యాలకలు -2, అల్లం -1 అంగుళం ,వెల్లులి రెబ్బలు -3.


తాలింపు కొరకు : కరివేపాకు -2 రెమ్మలు , జీలకర్ర - 1/4 టీస్పూన్, ఆవాలు -1/4 టీస్పూన్.


తయారీ : ముందుగా కొబ్బెరి ముక్కలు, ధనియాలు, లవంగాలు, చెక్క, యాలకలు, అల్లం ,వెల్లులి రెబ్బలుని కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తని పేస్టులా మిక్సీ వేసుకోవాలి. ఒక కడాయిలో నూనె పోసుకుని తాలింపు సామాను అన్ని వేసుకోవాలి అవి కొంచెం చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.


ముక్కలు ఎర్రగా వేగాక రుబ్బిన మసాలాను వేసి 3 నిమిషాలు వేపుకోవాలి. తరువాత లివర్ ముక్కల్ని వేసి ఒక నిమిషం కలయబెట్టాలి. తరువాత ఉప్పు, కారం , పసుపు వేసి ఇంకొక 5 నిమిషాలు వేయించుకోవాలి. చివరిగా కొత్తిమీర చల్లుకుని నిమ్మకాయ రసం వేసి కలుపుకోవాలి.

    

No comments:

Post a Comment