కావాల్సినవి:
వంకాయలు-3/4 కేజీ ,ఉల్లిపాయలు-2,పచ్చి మిర్చి-3,అల్లం వెల్లుల్లి ముద్ద-1 టేబుల్ స్పూన్,పసుపు-చిటికెడు,ఉప్పు-తగినంత,కారం-1 టీ స్పూన్,కొత్తిమీర-కొద్దిగా ,నూనె-3 టేబుల్ స్పూన్స్,పచ్చి సెనగపప్పు-1/2 టీ స్పూన్,ఎండు మిర్చి-1,జీలకర్ర-కొద్దిగా,ఆవాలు-3/4 టీ స్పూన్.
తయారీ:
ముందుగా వంకాయలని పొడవు ముక్కలుగా కోసుకుని ఉప్పు నీటిలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి, అలానే ఉల్లిపాయల్ని కూడా పొడవుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె పోసుకుని వేడి అయ్యాక ఆవాలు,జీలకర్ర,పచ్చి సెనగపప్పు,ఎండు మిర్చి వేసి వేగాక ఉల్లిపాయముక్కలు,పసుపు,అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి.
తరువాత వంకాయ ముక్కలని నీటి లో నుండి తీసి కడాయిలో వేసుకుని ఉప్పు చల్లి మీడియం మంట మీద మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుని తర్వాత కారం చల్లుకుని కలిపి మూత లేకుండా ముక్క మెత్తపడే వరకు వేయించుకొని చివరగా కొత్తిమీర వేసి కలిపి గిన్నెలోకి తీసుకుని వడ్డించుకోవాలి. ఈ కూర రైస్ లో తినటానికి బాగుంటుంది.