కావాల్సినవి :
- వంకాయలు - 1/4 కేజీ
- పల్లీలు - 1/4 కప్పు
- పచ్చిమిర్చి - 200 గ్రా (25 కాయలు)
- ధనియాలు - 1 టేబుల్ స్పూన్
- జీలకర్ర - 1/2 టీస్పూన్
- వెల్లులి -3 రెబ్బలు
- ఉప్పు - తగినంత (1 టేబుల్ స్పూన్)
- నూనె - 4 టేబుల్ స్పూన్లు
- చింతపండు - కొద్దిగా
- జీలకర్ర - 1/4 టీస్పూన్
- ఆవాలు -1/4 టీస్పూన్
- మినపప్పు - 1/2 టీస్పూన్
- పచ్చిపప్పు -1/2 టీస్పూన్
- ఎండుమిర్చి -2
- కరివేపాకు - 1 రెమ్మ
ముందుగా పల్లీలని కడాయిలో వేసి, వేపి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి .
స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అది వేడెక్కిన తరువాత వంకాయలు మరియు పచ్చిమిర్చి వేసి 2 నిమిషాలు మగ్గించుకోవాలి.
తరువాత జీలకర్ర ధనియాలు వెల్లులి ,ఉప్పు మరియు చింతపండు వేసి 1 నిమిషం వేపుకుని కొద్దిగా నీళ్లు మరియు పక్కన పెట్టుకున్న పల్లిలని వేసి మిక్సీ పట్టుకోవాలి .
మిగిలిన నూనె వేసుకుని తాలింపు కొరకు పెట్టుకున్న సామాను వేసి అవి చిటపటలాడిన తర్వాత పచ్చడిలో వేసి కలుపుకోవాలి. అంతే మీ ముందు వంకాయ పల్లీల పచ్చడి సిద్ధం..
ఈ పచ్చడి అన్నం లోకి మరియు టిఫిన్స్ కి బాగుంటుంది.
No comments:
Post a Comment