కావాల్సినవి:
- బీన్స్ -3/4కేజీ
- టమాటా -3
- ఉల్లిపాయ -1
- పచ్చిమిర్చి -2
- కారం -1/2 టీస్పూన్
- ఉప్పు -తగినంత
- పసుపు -1/4 టీస్పూన్
- పచ్చిపప్పు -1/2 టీస్పూన్
- జీలకర్ర -1/2 టీస్పూన్
- ఆవాలు -1/2 టీ స్పూన్
- నూనె- 3టేబుల్ స్పూన్స్
- కొత్తిమీర -తగినంత
- ఎండు మిర్చి -1
- వెల్లుల్లిపాయ రెబ్బలు -2
ముందుగా బీన్స్ ,టమాటా ,ఉల్లిపాయ, పచ్చిమిర్చి ,వెల్లుల్లిని సన్నని ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నూనె పోసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, ఎండుమిర్చి వేసి వేగాక వెల్లుల్లి ,పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు ,పసుపు వేసి 2 నిమిషాలు మగ్గించుకోవాలి.
తరువాత బీన్స్ ముక్కలు ,ఉప్పు చల్లి అన్ని కలిసేట్టు తిప్పి మూత పెట్టుకుని 5 నిమిషాలు మీడియం మంట మీద మగ్గించుకోవాలి.
తరువాత ముక్క కొంచెం మెత్తబడింది అనుకున్నప్పుడు టమాటా ముక్కలు, కారం వేసి కలిపి మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కూరలో నీరు తక్కువగా ఉంటె ఒక 1/2గ్లాసు నీరు పోసుకుని కూర దగ్గరికి పడే వరకు ఉడికించుకుని చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఈ కూర అన్నం,చపాతీ,రోటిలో తినటానికి బాగుంటుంది.
No comments:
Post a Comment