- అలసందలు -1కప్పు,
- ఉల్లిపాయ -1,
- పచ్చిమిర్చి -2,
- టమాటా ముక్కలు -1 కప్పు,
- బంగాళాదుంప -1,
- కారం -1 టీస్పూన్,
- ఉప్పు -తగినంత,
- ధనియాల పొడి -1 టీస్పూన్,
- గరంమసాలా -1 టీస్పూన్,
- పావ్ బాజీ మసాలా -1 టీస్పూన్(optional)
- కొత్తిమీర -కొద్దిగ
- వెల్లుల్లి రెబ్బలు -2
- కరివేపాకు -2 రెమ్మలు
- జీల కర్ర -1/2 టీస్పూన్
- నూనె/బటర్ -3 టేబుల్ స్పూన్స్.
తయారీ: బొబ్బర్లని శుభ్రంగా కడిగి నీరు పోసి ఒక రాత్రి అంతా లేదా 7 నుంచి 8 గంటలు నాన పెట్టుకుని పక్కన పెట్టుకోండి. కుక్కర్ లో నానపెట్టుకున్న బొబ్బర్లు ,బంగాళాదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, ఒక పెద్ద గ్లాస్ నీరు పోసి 4 కూతలు వచ్చే వరకు ఉంచి, పక్కన పెట్టుకుని ఆవిరి పోయిన తరువాత గరిటతో కచ్చా పచ్చగా మెదుపుకుని కారం, పావ్ బాజీ మసాలా వేసి కలిపి, గట్టిగా ఉంటె మరి కొంచెం నీరు పోసి ఉడికించుకుంటూ ఉండాలి.
తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె లేదా బటర్ వేసుకుని వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు వేసి వేగాక, ఉడుకుతున్న అలసందలు కూరలో వేసి కలుపుకుని సెర్వింగ్ బౌల్ లోకి తీసుకుని నిమ్మరసం, కొత్తిమీర, మిక్సర్ వేసి వడ్డించుకోవాలి. ఈ కూర చపాతీ, రోటి, రైస్ మరియు చాట్ లాగ తినటానికి రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment