కావాల్సినవి :
- బాస్మతి రైస్ - 1/2 కేజీ
- చికెన్ - 3/4 కేజీ లేక 1/2 కేజీ
- పసుపు - 1/4 టీస్పూన్
- కారం -1 టీస్పూన్
- ధనియాల పొడి - 1/2 టీస్పూన్
- జీలకర్ర పొడి - 1/4 టీస్పూన్
- ఉప్పు -తగినంత
- బిరియాని మసాలా పొడి / గరం మసాలా -1 టీస్పూన్
- బిరియాని ఆకు - 3
- యాలకలు -3
- లవంగాలు -4
- చెక్క - 2 ఇంచులు
- జాజికాయ -2
- జావిత్రి -1
- అనాస పువ్వు -2
- అల్లం వెల్లులి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
- నిమ్మకాయ రసం - 1 టేబుల్ స్పూన్
- పెరుగు - 1/2 కప్పు
- నూనె / నెయ్యి - 4 టేబుల్ స్పూన్లు
- కొత్తిమీర -2 రెమ్మలు
- పుదీనా -2 రెమ్మలు
- పచ్చిమిర్చి -2
- ఉల్లిపాయలు -1
- జీడిపప్పులు -15
- కుంకుమ పువ్వు -2 రేకులు
- పాలు -1 టేబుల్ స్పూన్
తయారీ :
ముందుగా చికెన్ ని శుభ్రం చేసుకుని పసుపు ,కారం ,ధనియాల పొడి ,జిలకర్ర పొడి, ఉప్పు , బిరియాని మసాలా పొడి / గరం మసాలా ,బిరియాని ఆకు ,యాలకలు ,లవంగాలు ,చెక్క , జాజికాయ ,జావిత్రి ,అనాస పువ్వు ,అల్లం వెల్లులి పేస్ట్ ,నిమ్మకాయ రసం ,పెరుగు ,నూనె / నెయ్యి 2 స్పూన్లు ,తరిగిన కొత్తిమీర ,పుదీనా మరియు పచ్చిమిర్చి వేసి బాగా కలిపి 1 గంట పక్కన పెట్టుకోవాలి. కుంకుమ పువ్వుని పాలలో వేసి పక్కనపెట్టుకోవాలి. బాస్మతి బియ్యం లో నీళ్లు పోసి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. రెండు స్పూన్లు నూనె లేక నెయ్యి వేసి ఉల్లిపాయని ఎర్రగా వేపుకుని పక్కన పెట్టుకుని, జీడిపప్పుని ఎర్రగా వేపి పాకాన పెట్టుకోవాలి.
నానబెట్టిన బియ్యంలో కొద్దిగా ఉప్పు నూనె మసాలా సామాను వేసి 75% ఉడికించుకుని నీళ్లు వడకట్టి ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ మీద వేసి వేయించిన ఉల్లిపాయలు ,జీడిపప్పు మరియు కుంకుమపూవు పాలు వేసి మైదా పిండిని మూత చుట్టూ పెట్టి ,గిన్నె మీద మూత గట్టిగా పెట్టాలి.
గిన్నె ని హై మంట మీద ఒక నిమిషం ఉంచి ,మిడిముమ్ మీద 3 నిమిషాలు ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెనం (ఇలా చేయడం వల్ల మసాలా మాడకుండా ఉంటుంది) పెట్టుకుని దాని మీద గిన్నెని ఉంచి 10 నిమిషాలు స్లో మంట మీద ఉడికించి పక్కన పెట్టుకోవాలి .తర్వాత మైదా పిండి సీల్ ఓపెన్ చేసి అంత ఒకసారి కలుపుకుని సర్వ్ చేసుకోవాలి.
No comments:
Post a Comment