Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Friday, 24 February 2017

Chakkara pongali/Sweet pongal/Pongal(చక్కర పొంగలి)


కావాల్సినవి:
  • బియ్యం -1 కప్పు 
  • పెసరపప్పు -1/2 కప్పు 
  • పాలు -1/2 లీటర్ 
  • బెల్లం -1కప్పు
  • నీరు -1/2 కప్పు 
  • నెయ్యి -1/4 కప్పు 
  • జీడిపప్పు -10
  • కిస్మిస్ -10
  • పచ్చి కొబ్బరి ముక్కలు -3/4 కప్పు 
  • ఉప్పు -చిటికెడు 
  • యాలకలు -3
తయారీ:
స్టవ్ మీద మందపాటి అడుగు  ఉన్న గిన్నె పెట్టుకుని నెయ్యి వేసి వేడి అయ్యాక జీడిపప్పు, కిస్మిస్లు ,కొబ్బరి ముక్కలు వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే గిన్నెలో పాలు పోసుకుని, యాలకలు దంచి వేసుకుని పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి.


తరువాత మరుగుతున్న పాలలో బియ్యం, పెసరపప్పు వేసి, కలిపి మూత పెట్టి మద్యలో కలుపుకుంటూ, అన్నం మెత్తగా అయ్యే  వరకు ఉడికించుకోవాలి. అన్నం ఉడికేలోపు వేరే స్టవ్ మీద గిన్నె పెట్టుకుని బెల్లం తురుము మరియు 1/2 కప్పు నీరు పోసుకుని బెల్లం కరిగి  కొంచెం చిక్కబడే వరకు ఉడికించుకోవాలి .


తరువాత ఉడికిన అన్నంలో పాకం వేసి కలుపుకుని మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరగా ముందుగా వేయించిపెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్లు, కొబ్బరి ముక్కలు, ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. అంతే వేడి వేడి చక్కర పొంగలి రెడీ. 


గమనిక: బియ్యం, పెసరపప్పుని అరగంట ముందు  నాన పెట్టుకుకోవాలి. తీపి ఎక్కువ కావాలి అనుకునే వారు బెల్లం కొంచెం ఎక్కువగా తీసుకోండి. అలానే మరీ  చిక్కగా ఉండే పాలు వాడటం వలన అడుగు అంటుతుంది కనుక పాలలో కొద్దిగా నీరు కలుపుకోండి.    

No comments:

Post a Comment