కావాల్సినవి :
- ఓట్స్ -1 కప్పు
- ఉల్లిపాయ -1
- టమాటా -1
- క్యారెట్ -1
- పచ్చిబఠాణి -3 టేబుల్ స్పూన్స్
- పచ్చిమిర్చి -2
- నూనె -3 టేబుల్ స్పూన్స్
- ఆవాలు -3/4 టీ స్పూన్స్
- మినపప్పు- 1 టీ స్పూన్
- జీలకర్ర -1/2 టీ స్పూన్
- వేరుశెనగపప్పు -2 టేబుల్ స్పూన్స్
- ఎండు మిర్చి -1
- ఉప్పు -తగినంత
- నిమ్మరసం -2 టేబుల్ స్పూన్స్
- కొత్తిమీర -కొద్దిగా
తయారీ:
స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నూనె పోసి వేడి అయ్యాక ఆవాలు ,జీలకర్ర ,పచ్చిసెనగపప్పు, వేరుశెనగపప్పు, ఎండుమిర్చి వేసి వేగాక ,ఉల్లిపాయ ముక్కలు ,పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠాణి వేసి ఉప్పు చల్లి మీడియం మంట మీద 3 నిమిషాలు మగ్గించుకోవాలి.
అవి మగ్గే లోపు వేరే స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె వెయ్యకుండా ఓట్స్ ని పచ్చి వాసన పోయేలా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
తరువాత ఓట్స్ ని మగ్గుతున్న కూరగాయ ముక్కలు ఉన్న గిన్నెలో వేసి కలిపి, కొద్దీ కొద్దీగా నీరు చల్లుకుంటూ ఓట్స్ మెత్తబడే వరకు ఉంచి, చివరగా కొత్తిమీర, నిమ్మరసం కలుపుకుని ప్లేట్ లోకి తీసుకుని వేడి వేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
(ఓట్స్ వేసాక మంట తక్కువ లో పెట్టుకుని చేసుకుంటే అడుగు మాడిపోకుండా ఉంటుంది, మరియు ఒకేసారి ఎక్కువ నీరు పోసుకుంటే ఓట్స్ ఉప్మా పొడి పొడిగా రాకుండా ముద్దలా అవుతుంది.)
No comments:
Post a Comment