కావాల్సినవి :
- మటన్ - 1/2 కేజీ
- ఉల్లిపాయలు - 1
- పచ్చిమిర్చి -2
- కరివేపాకు -1 రెమ్మ
- కొత్తిమీర -2 రెమ్మలు
- పుదీనా - 1 రెమ్మ
- గరంమసాలా - 1టీస్పూన్
- జీలకర్ర పొడి - 1/4 టీస్పూన్
- ధనియాలపొడి - 1/2 టీస్పూన్
- ఎండు కొబ్బరి పొడి -3 టేబుల్ స్పూన్లు
- మిరియాలు -1/2 టీస్పూన్
- బిరియాని ఆకు - 2
- చెక్క -2 ఇంచులు
- యాలకలు -2
- లవంగాలు -2
- సోపు గింజెలు - 1/2 టీస్పూన్
- అల్లం వెల్లులి ముద్ద- 1 టీస్పూన్
- పసుపు - చిటికెడు
- కారం - 1 టీస్పూన్
- నూనె -2 టేబుల్ స్పూన్లు
- ఉప్పు -తగినంత (1 టీస్పూన్)
ముందుగా కుక్కర్ ని స్టవ్ మీద పెట్టుకుని నూనె పోసుకోవాలి అది వేడెక్కినా తర్వాత కరివేపాకు ,బిరియాని ఆకు ,చెక్క ,యాలకలు ,సోపు గింజలు, లవంగాలు మరియు మరియాలు వేసి ఒక నిమిషం వేపిన తరువాత ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఒక నిమిషం వేపిన తరువాత అల్లం వెల్లులి ముద్ద వేయాలి.
అల్లం వెల్లులిని పచ్చి వాసన పోయేవరకు వేపుకుని మటన్ ముక్కలు వేయాలి. తర్వాత ఉప్పు ,పసుపు ,ధనియాల పొడి ,జీలకర్ర పొడి వేసి 1 కప్పు (200 ml) నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి మీడియం మంట మీద మూడు విజిల్స్ వచ్చేదాక ఉడికించుకోవాలి.
తరువాత కుక్కర్ మూత తీసి గరంమసాలా, కారం ,కొబ్బరి పొడి వేసి కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర మరియు పుదీనా వేసి సర్వ్ చేసుకోడమే .అంతే మీ ముందు రుచికరమైన మటన్ కూర తయారు.
No comments:
Post a Comment