కావాల్సినవి :
- బోన్ లెస్ చికెన్ - 1/2 కేజీ
- పెరుగు -1/2 కప్పు
- ఫ్రెష్ క్రీం - 3 టేబుల్ స్పూన్స్
- వెల్లులి -2 రెబ్బలు
- ఉప్పు - తగినంత
- నిమ్మకాయ - 1 టీస్పూన్
- గరంమసాలా -1 టీస్పూన్
- కుంకుమ పువ్వు - 1/4 టీస్పూన్
- గుడ్డు -1
- ఉల్లిపాయ -1
- నూనె -2 టేబుల్ స్పూన్లు
ముందుగా ఒక గిన్నెలో చికెన్ ముక్కలు ,పెరుగు ,ఫ్రెష్ క్రీం ,సన్నగా తరిగిన వెల్లులి ముక్కలు ,ఉప్పు ,నిమ్మకాయ , గరంమసాలా ,కుంకుమ పువ్వు ,నూనె ,మరియు గుడ్డు వేసి బాగా కలుపుకుని 2 నుండి 4 గంటలు మ్యారినేట్ చేసుకోవాలి .
తరువాత చువ్వకి చికెన్ ముక్కలు మరియు పెద్దగా తరిగిన ఉల్లిపాయ ముక్కలని గుచ్చుకుని ఒవేన్ లో 200 డిగ్రీల మీద గ్రిల్ చేసుకోవాలి. ఒక పక్క బాగా గ్రిల్ అయినా తరువాత ఇంకో పక్కకు తిప్పి గ్రిల్ చేసుకోవాలి.. అంతే మీ ముందు చికెన్ కబాబ్ సిద్ధం.
No comments:
Post a Comment