కావాల్సినవి :
- కందిపప్పు -1కప్పు,
- టమాటాలు -4 పెద్దవి,
- ఉల్లిపాయ -1
- పచ్చిమిర్చి -3
- చింతపండు -పెద్ద ఉసిరికాయ అంత(టమాటాలు పులుపు ఉంటె చింతపండు తగ్గించుకుని వేసుకోండి)
- ఉప్పు -తగినంత
- పసుపు -1/2 టీస్పూన్
- వెల్లుల్లి రెబ్బలు -3 లేక 4
- నూనె -3 టేబుల్ స్పూన్స్
- ఆవాలు -1/2 టీస్పూన్
- పచ్చిపప్పు -1టీస్పూన్
- జీలకర్ర -1 టీస్పూన్
- ఉల్లి గింజెలు -3/4 టీస్పూన్(ఆప్షనల్)
- కరివేపాకు -2రెమ్మలు
- కొత్తిమీర -కొద్దిగా
ముందుగా ప్రెషర్ కుక్కర్ లో కందిపప్పుని శుభ్రంగా కడిగి ,దానిలో పొడవుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, చింతపండు, ఉప్పు వేసి 2. 1/2 కప్పుల నీరుపోసి 3 నుండి 4 కూతలు వచ్చే వరకు ఉంచి పక్కన పెట్టుకోవాలి.
ఆవిరి అంతా పోయాక మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోండి.
తరువాత ఒక కడాయి తీసుకుని నూనె పోసి ఆవాలు, జీలకర్ర, పచ్చి సెనగ పప్పు, ఉల్లి గింజెలు, కరివేపాకు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పులో తాలింపు వేసి చివరగా కొత్తిమీర చల్లుకుని కలిపి గిన్నెలోకి తీసుకుని వడ్డించుకోవాలి.
No comments:
Post a Comment