కావాల్సినవి:
- చికెన్ -1/2 కేజీ
- ఉల్లిపాయ -1
- పచ్చిమిర్చి -3
- పెరుగు - 1 కప్పు
- ఉప్పు -తగినంత
- పసుపు -చిటికెడు
- కారం -1 టీస్పూన్
- యాలకలు -2
- లవంగాలు -2
- చెక్క -1 ఇంచ్
- కరివేపాకు -1 రెమ్మ
- కొత్తిమీర - 2 రెమ్మలు
- పుదీనా - 1 రెమ్మ
- నూనె -3 టేబుల్ స్పూన్లు
- కొబ్బరి ముక్కలు - 4 టేబుల్ స్పూన్లు
- ధనియాలు -1 టేబుల్స్ స్పూన్
- గసగసాలు -1 టీస్పూన్
- యాలకలు -3
- లవంగాలు -3
- చెక్క - 2 చిన్న ముక్కలు
- అల్లం - 2 ఇంచ్లు
- వెల్లులి -3 రెబ్బలు
ముందుగా ఒక కడాయి తీసుకుని నూనె పోసి అది వేడెక్కిన తరువాత యాలకలు ,చెక్క , లవంగాలు మరియు కరివేపాకు వేసి అది చిటపటలాడిన తర్వాత తరిగిన ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం వేపి ముందుగా పక్కన పెట్టుకున్న మసాలా ముద్ద వేసి పచ్చి వాసన పోయేవరకు (5 నిమిషాలు) వేపుకోవాలి.
చికెన్ మరియు పెరుగు వేసి మరియొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు, కారం మరియు 1 కప్పు నీళ్లు పోసి దగ్గర పడేవరకు ఉడికించుకోవాలి. ముక్క ఉడికిందో లేదో చూసుకుని. కొత్తిమీర మరియు పుదీనా ఆకులు చల్లుకుని సర్వ్ చేసుకోడమే .
No comments:
Post a Comment