బననా ఆపిల్ షేక్ లో ఎన్నో పోషక విలువలు ఉండడమే కాక వ్యాయామం చేసిన వారికీ లేక రోజంతా పనిచేసి అలిసిపోయిన వారికీ తక్షణమే శక్తిని ఇస్తుంది. ఇందులో మనం పంచదారకి బదులుగా కిస్మిస్ మరియు ఖర్జురమ్ వాడడం వలన డైట్ పట్ల శ్రద్ధ ఉన్నవారు కూడా తీసుకొనవచ్చు. వీటికి పాలు చేర్చడం వలన ఎముకల పుష్టికి కూడా దోహద పడుతుంది.
- అరటిపండు ,ఆపిల్ ,ఖర్జురం మరియు క్రాన్బెర్రీ లేక కిస్మిస్ ని సన్నని ముక్కలుగా తరిగి బ్లండర్ లేక మిక్సీ జార్ లో వేసి 1 నిమిషం మెదుపుకోవాలి.
- తరువాత పాలు వేసి మరియొక నిమిషం మెదుపుకోవాలి . అంతే ఎంతో తేలిక అయిన బననా ఆపిల్ స్మూతీ తయారు.
- తీపి మరింత ఇష్టపడేవారు ఒక స్పూన్ తేనె కలుపుకోవచ్చు.
- పాలు ఇష్టంలేనివారు నీరు కలుపుకొనవచ్చు.
Nice recipe.. Do post more ��
ReplyDeleteKeep going !! More power
ReplyDelete