కావాల్సినవి: బెండకాయ ముక్కలు-1పెద్ద కప్పు, పల్లీలు -3/4 కప్పు, జీడిపప్పు-10, ఎండుకొబ్బరి పొడి-1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం-1 టేబుల్ స్పూన్, కరివేపాకు-2 రెమ్మలు, ఎండుమిర్చి-2, నూనె-డీప్ ఫ్రై కి సరిపడినంత.
తయారీ: స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి, వేడి అయ్యాక పల్లీలు వేసి వేయించుకుని ఒక గిన్నెలో వేసుకోండి. అలానే జీడీ పప్పు, కరివేపాకు, ఎండు మిర్చి ఒకదాని తరువాత ఒకటి వేయించుకుని గిన్నెలోవేసుకుని పక్కన పెట్టుకోవాలి.
చివరగా బెండకాయ ముక్కలు కూడా వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుని గిన్నెలో వేసి, ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ,జీడిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వాటితో పాటు ఎండు కొబ్బరి పొడి, ఉప్పు, కారం కూడా వేసి అన్ని బాగా కలిపి సెర్వింగ్ బౌల్ లోకి తీసుకోండి .అంతే బెండకాయ పల్లీ వేపుడు రెడీ. సాంబార్ర లేక రసంతో తినటానికి ఈ వేపుడు బాగుంటుంది.

No comments:
Post a Comment