కావాల్సినవి: పెసరపప్పు-1కప్పు, టమాటా- 1, ఉల్లిపాయ-1, చింతపండు-నిమ్మకాయంత నీటిలో నానపెట్టుకోవాలి, ఉప్పు-తగినంత, కారం-1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి-2.
తాలింపు కొరకు: నూనె-2 టేబుల్ స్పూన్స్, ఆవాలు-3/4 టీస్పూన్, జీలకర్ర-1/2 టీ స్పూన్, పచ్చిపప్పు-1 టీ స్పూన్,మినపప్పు-1 టీ స్పూన్,ఎండు మిర్చి-1,కరివేపాకు-2 రెమ్మలు,కొత్తిమీర-తగినంత,పసుపు-కొద్దిగా,వెల్లుల్లి-2 రెబ్బలు.
తయారీ: ముందుగా పెసరపప్పుని కుక్కర్ లో వేసి కడిగి నీరు పోసుకుని, టమాటా ముక్కలు, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి వేసి 3 కూతలు వచ్చే వరకు ఉడికించుకుని, దానిలో చింతపండు రసం, మంచి నీరు పులుపుకి సరిపడినంత పోసుకుని కారం వేసి మరిగించుకోవాలి .
మరో స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె పోసి ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు, కరివేపాకు, వెల్లుల్లి వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి చిటికెడు ఉప్పు చల్లి వేగాక, ఈ తాలింపుని మరుగుతున్న చారులో వేసుకుని కలుపుకొని 5 నిమిషాలు మరిగించుకుని చివరగా కొత్తిమీర వేసుకుని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి తీసుకొని వడ్డించుకోవాలి.

No comments:
Post a Comment