కావాల్సినవి:
- చింతపండు- పెద్ద నిమ్మకాయ అంత
- పచ్చి సెనగ పప్పు- 1 టేబుల్ స్పూన్
- ఆవాలు- 1/2 టీస్పూన్
- మినపప్పు-1 టేబుల్ స్పూన్
- వేరుశెనగపప్పు-2 టేబుల్ స్పూన్స్
- పసుపు- 1/2 టీస్పూన్
- ఇంగువ- 2 చిటికెలు
- మిరియాలు- 5
- ఎండుమిర్చి- 2
- పచ్చిమిర్చి- 3 లేక 4
- ఉప్పు- తగినంత
- బియ్యం- 1 కప్పు
- నూనె- 3 టేబుల్ స్పూన్స్
- కరివేపాకు- 2రెమ్మలు.
- అల్లం ముక్కలు -1 స్పూన్
తయారీ: ముందుగా బియ్యాన్ని కడిగి రెండు కప్పుల నీరు పోసుకుని, దానిలో కొంచెం ఉప్పు ,నూనె వేసి పొడిపొడిగా ఉండేలా ఉడికించుకుని పక్కన పెట్టుకోండి. తరువాత కడాయి స్టవ్ మీద పెట్టుకుని నూనె పోసి ఆవాలు, పచ్చి సెనగపప్పు,వేరుశెనగ పప్పు, మినపప్పు, మిరియాలు, ఎండు మిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ, పచ్చిమిర్చి కూడా వేసి 2 నిమిషాలు వేగాక చింతపండు గుజ్జు , ఉప్పు వేసి 5 నిమిషాలు తక్కువ మంట మీద నూనె బయటికి వచ్చే వరకు వేయించుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో చింతపండు మిశ్రమాన్ని వేసి బాగా కలిసేట్టు కలుపుకోవాలి.అంతే పులిహోర సిద్ధం,ఈ చింతపండు పులిహోర రెండు రోజులు వరకు రుచిగా ఉంటుంది.
గమనిక:
- చింతపండు గుజ్జు కోసం చింతపండులో కొంచెం వేడి నీరు పోసుకుని కొంచెం సేపు నాన పెట్టుకుని బాగా పిసుక్కోని, పిప్పి వేరు చేసి గుజ్జు తీసుకోవాలి. అలానే ఉప్పు,పులుపు మీ రుచికి తగినట్టు సరి చూసుకుని కలుపుకోగలరు.
- అన్నం వేడి తగ్గిన తర్వాత పులుసుతో కలుపుకోవాలి.
No comments:
Post a Comment