కావాల్సినవి: నాన పెట్టుకున్న అలసందలు-1 పెద్ద కప్పు, పచ్చి మిర్చి-2, అల్లం ముక్కలు-1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క-కొద్దిగా, లవంగాలు-5, జీలకర్ర-1 టీస్పూన్, సెనగ పిండి-2 టేబుల్ స్పూన్స్, బియ్యం పిండి-2 టేబుల్ స్పూన్స్, ఉప్పు-తగినంత, కారం-1 టీస్పూన్, కొత్తిమీర-తగినంత, నూనె- డీప్ ఫ్రై కి సరిపడా.
తయారీ: ముందుగా అలసందలని మిక్సీ లో వేసి ఉప్పు వేసుకుని కచ్చా పచ్చగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, దాల్చిన చెక్క, లవంగాలు మిక్సీలో వేసి కచ్చా పచ్చగా రుబ్బుకుని ముందుగా రుబ్బి పెట్టుకున్న అలసందల పిండి లో వేసుకుని, బియ్యం పిండి,సెనగ పిండి, జీల కర్ర, కారం, కొత్తిమీర కూడా వేసుకుని నీరు పోసుకోకుండా అన్ని కలిసేట్టు బాగా కలుపుకోండి.
మరీ గట్టిగ ఉంటె కొంచెం నీరు చల్లుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి వేడి అయ్యాక అలసందలు మిశ్రమాన్ని చేతితో నిమ్మకాయంత ఉండలు చేసుకుని, అరచేతికి నీరు రాసుకుంటూ మధ్యలో పెట్టుకుని కొంచెం మందంగా వద్దుకుని నెమ్మదిగా తీసి నూనెలోకి వేసుకోవాలి.
ఇలా ఒకేసారి కడాయిలో సరిపడినన్ని వేసుకుని రెండు వైపులా ఎర్రగా అయ్యేవరకు మీడియం మంట మీద కాల్చుని తీసుకోవాలి. ఈ వడలు కరకరలాడుతూ టమాటా సాస్ తో తింటే చాల రుచిగా ఉంటాయి.

vadalu ruchiga unnaye. thanks andi. inka post cheyyandi
ReplyDelete