కావాల్సినవి:
- ఉడికించిన అన్నం- 1 కప్పు
- పెరుగు- 1కప్పు
- ఉప్పు- తగినంత
- తరిగిన పచ్చిమిర్చి - 1 టీస్పూన్
- మిరియాలు- 5
- క్యారెట్ తురుము- కొద్దిగా
- ఏండుమిర్చి- 1
- కొత్తిమీర- కొద్దిగా
- కరివేపాకు- 2 రెమ్మలు
- నూనె-2 టేబుల్ స్పూన్స్
- ఆవాలు- 1/4 టీస్పూన్
- పచ్చి సెనగపప్పు- 1 టీస్పూన్
- మినపప్పు- 1 టీస్పూన్
- జిలకర్ర- 1/2 టీస్పూన్
తయారీ:
ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో ఉప్పు, పెరుగు, పచ్చి మిర్చి, క్యారెట్ తురుము , కొత్తిమీర వేసి కలుపుకుని, కడాయిలో నూనె వేసుకుని వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చి సెనగ పప్పు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేగాక ముందుగా కలుపుకున్న పెరుగు అన్నంలో వేసి కలుపుకుని దానిమ్మ గింజలు వేసి అలంకరించుకుని అతిధులకు వడ్డించాలి.
No comments:
Post a Comment