కావాల్సినవి: క్యాలీఫ్లవర్ ముక్కలు - 1 కప్పు ,ఉప్పు - రుచికి తగినంత ,కారం -1/2 టీస్పూన్ , వాము -1/4 టీస్పూన్ ,బియ్యంపిండి -2 టేబుల్ స్పూన్లు ,సెనగపిండి -1/4 కప్పు ,వంటసోడా -చిటికెడు ,అల్లంవెల్లులి పేస్ట్ -1/2 టీస్పూన్, నూనె -డీప్ ఫ్రైకి సరిపడినంత, నీరు -కొద్దిగా.
తయారీ : ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో తరిగిన క్యాలీఫ్లవర్ ముక్కలు, సెనగపిండి , బియ్యంపిండి ,ఉప్పు, కారం ,వాము ,వంటసోడా ,అల్లంవెల్లులి పేస్ట్ మరియు కొద్దిగా నీరు పోసి జారుగా కలుపుకోవాలి . తర్వాత కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి అది వేడియెక్కిన తర్వాత(కొద్దిగా పిండిని నూనెలో వేసి అది పైకి వస్తే నూనె బాగా కాగినట్లు) క్యాలీఫ్లవర్ ముక్కలని వేసి ఎర్రగా వేపుకుని కిచెన్ టిష్యూ పేపర్ మీద వేసుకుని తీసి సర్వ్ చేసుకోడమే. కొంచెం నిమ్మకాయ పిండుకుని తింటే అద్భుతః !! పిల్లలు స్నాక్స్ గా చాలా ఇష్టపడతారు.
No comments:
Post a Comment