కావాల్సినవి : బొంబాయి రవ్వ -1 కప్పు , ఉల్లిపాయ -1, అల్లం ముక్కలు -2 టీస్పూన్లు ,తరిగిన పచ్చిమిర్చి- 2 టీస్పూన్ల ,నెయ్యి -3 టేబుల్ స్పూన్లు, ఆవాలు - 1/4 టీస్పూన్ ,జీలకర్ర -1/2 టీస్పూన్ ,పచ్చిపప్పు -1 టీస్పూన్ ,మినపప్పు -1 టీస్పూన్ , జీడిపప్పు-20 పలుకులు ,పల్లీలు -3 టీస్పూన్స్, ఎండుమిర్చి -2, కరివేపాకు -2 రెమ్మలు, ఉప్పు- తగినంత (1/2 టీస్పూన్), పసుపు -చిటికెడు ,ఇంగువ -చిటికెడు ,కొత్తిమీర -2 రెమ్మలు .
తయారీ : ముందుగా కడాయిలో నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు ,జీడిపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు మరియు ఇంగువ వేసి బాగా ఎర్రగా వేపుకోవాలి. తర్వాత అల్లం మరియు పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం వేపిన తరువాత తరిగిన ఉల్లిపాయలు వేసి మరో రెండు నిమిషాలు వేపుకోవాలి.
రవ్వ వేసి 1 నిమిషం వేపి ఉప్పు, పసుపు మరియు 2 కప్పుల నీరు పోసి దగ్గర పడేవరకు ఉడికించుకుని చివరిగా కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోడమే. అంతేనండీ కమ్మని నేతి ఉప్మా సిద్ధం.
రవ్వ వేసి 1 నిమిషం వేపి ఉప్పు, పసుపు మరియు 2 కప్పుల నీరు పోసి దగ్గర పడేవరకు ఉడికించుకుని చివరిగా కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోడమే. అంతేనండీ కమ్మని నేతి ఉప్మా సిద్ధం.
గమనిక :
- వేపిన జీడిపప్పు మరియు పల్లీలు నేను ముందుగా సిద్ధం చేసుకోవడం వలన తాలింపులో వేయలేదు. ఒకసారి గమనించుకోగాకారు.
Yummy !! Nice blog. Keep it up.
ReplyDelete