కావాల్సినవి :
- బీరకాయ -1
- ఉల్లిపాయ -1
- పచ్చిమిర్చి -3
- నానబెట్టిన పచ్చి శెనగపప్పు -1/2 కప్పు
- కారం -1 టీస్పూన్
- ఉప్పు -తగినంత
- పసుపు -1/4 టీస్పూన్
- టమాటా-1
- కొత్తిమీర -2 రెమ్మలు
- నూనె -2 టేబుల్ స్పూన్లు
- ఆవాలు - 1/4 టీస్పూన్
- జీలకర్ర -1/4 టీస్పూన్
- మినపప్పు -1 టీస్పూన్
- ఎండుమిర్చి -2
- కరివేపాకు -1 రెమ్మ
- వెల్లులి -2 రెబ్బలు
ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నూనె పోసి కొంచెం వేడెక్కిన తర్వాత తాలింపు కొరకు పెట్టుకున్న సామాను వేసి అవి చిటపటలాడిన తరవాత తరిగిన ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి వేసి 2 నిమిషాలు మగ్గించుకోవాలి.
తరువాత తరిగిన బీరకాయ మరియు సెనగపప్పు వేసుకుని మరియొక రెండు నిమిషాల మగ్గించుకోవాలి.
టమాటా ముక్కలు వేసి ఉప్పు ,పసుపు మరియు కప్పు నీరు పోసి 10 నిముషాలు ఉడికించుకోవాలి.
చివరిగా కారం మరియు కొత్తిమీర చల్లుకుని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. అంతే మీ ముందు బీరకాయ సెనగపప్పు కూర సిద్ధం .
No comments:
Post a Comment