కావాల్సినవి :
- వైట్ బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్ స్లైసులు - 5
- వేరుశెనక పప్పులు -1 టేబుల్ స్పూన్
- జీల కర్ర -1/2 టీస్పూన్
- నూనె లేదా బటర్ -3 టేబుల్ స్పూన్స్
- క్యారెట్ -1
- టమాటా -1
- పచ్చిబఠాణి -1 టేబుల్ స్పూన్
- ఉల్లిపాయ -1(చిన్నది)
- పచ్చిమిర్చి -2
- చాట్ మసాలా -1/2 టీస్పూన్
- డ్రై మ్యాంగో పొడి -1/2 టీ స్పూన్
- ఉప్పు -తగినంత
- కొత్తిమీర -కొద్దిగా
- మిక్సర్ -కొద్దిగా
తయారీ:
ముందుగా బ్రెడ్ ని చిన్న ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే క్యారెట్, ఉల్లిపాయలు, టమాటా ,పచ్చిమిర్చిని సన్నగా తరిగి ఉంచుకోవాలి. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి అయ్యాక బ్రెడ్ ముక్కలు వేసి కొంచెం గట్టిగా అయ్యే వరకు దోరగా వేయించుని పక్కన పెట్టుకోండి.
అదే కడాయిలో మరి కొంచెం నూనె వేసి వేడి అయ్యాక ,జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, పచ్చిబఠాణీ వేసి ఉప్పు చల్లి 5 నిమిషాలు వేయించుకుని ,తరువాత టమాటా ముక్కలు కూడా వేసి కలిపి మరో 3 నిమిషాలు మగ్గించుకుని ,చాట్ మసాలా,మ్యాంగో పొడి వేసి కలుపుకోవాలి.
ఎక్కువ నీరు లేకుండా కూరని వేయించుని చివరగా బ్రెడ్ ముక్కలు, కొత్తిమీర వేసుకుని కలిపి ప్లేటులోకి తీసుకుని మిక్సర్ వేసి, నిమ్మరసం చల్లుకుని తింటే చాల రుచిగా ఉంటుంది.
మ్యాంగో పొడి లేని వారు చివరిలో నిమ్మరసం కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది.
No comments:
Post a Comment