Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Monday, 27 March 2017

Andhra style carrot pickle,carrot avakaya (క్యారెట్ పచ్చడి )

క్యారెట్ పచ్చడి



కావాల్సినవి :

  • సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు-1 కప్పు
  • కారం-2 టేబుల్ స్పూన్స్
  • ఉప్పు-2 టేబుల్ స్పూన్స్
  • మెంతి పొడి-3/4 టీ స్పూన్
  • ఆవపిండి-1/2 టీ స్పూన్
  • నిమ్మరసం-తగినంత
  • నూనె-5 టేబుల్ స్పూన్స్
  • ఆవాలు-1 టీ స్పూన్
  • పచ్చి సెనగపప్పు-1 టీ స్పూన్
  • జీలకర్ర-1 టీ స్పూన్
  • కరివేపాకు-2 రెమ్మలు
  • వెల్లుల్లి-2రెబ్బలు
తయారీ:తరిగిన క్యారెట్ ముక్కలని ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో కారం, ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.


తరువాత కడాయిలో నూనె వేసుకుని వేడి అయ్యాక ఆవాలు, పచ్చిపప్పు, జీలకర్ర, కరివేపాకు, దంచిన వెల్లుల్లు రెబ్బలు వేసుకుని వేగాక, ముందుగా కలిపి పెట్టుకున్న క్యారెట్ ముక్కాల మీద వేసి బాగా కలయ పెట్టి చివరగా నిమ్మరసం కూడా వేసి కలుపుకుని సీసాలోకి తీసుకుని నిల్వ చేసుకోవచ్చు.


ఈ  పచ్చడి పుల్లగా,క్యారెట్ ముక్క  కరకర లాడుతూ చాల రుచిగా ఉంటుంది. అన్నం ,దోసలోకి ఈ పచ్చడి రుచిగా  ఉంటుంది మరియు 15 రోజులవరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు.


నోట్ : మెంతి పిండి కోసం కొద్దిగా మెంతులని తీసుకుని కడాయిలో నూనె లేకుండా వేడి చేసుకుని, మిక్సీ లో వేసుకుని మెత్తగా పొడి చేసుకుని నిల్వ చేసుకుంటే అన్ని పచ్చడులలోకి వాడుకోవచ్చు.
అలానే ఆవ పిండి కోసం ఆవాలని (వేయించనవసరం లేదు) మిక్సీ లో వేసి మెత్తగా పొడి చేసుకుంటే సరిపోతుంది. మార్కెట్ లో కూడా ఆవ  మరియు మెంతి పొడులు  మనకి అందుబాటులో ఉంటున్నాయి కనుక మీకు నచ్చినది ఉపయోగించవచ్చు. 

No comments:

Post a Comment