కావాల్సినవి :
- బ్రోకలీ -1
- వెల్లులి -1
- పచ్చిమిర్చి -2
- వెజిటేబుల్ స్టాక్ పొడి -1
- క్రీం -1 టేబుల్ స్పూన్
- ఆలివ్ నూనె -2 టీస్పూన్ల
- నీళ్లు - 2 కప్పులు
ముందుగా అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఆలివ్ నూనె పోయాలి.
నూనె వేడెక్కిన తర్వాత వెల్లులి మరియు పచ్చిమిర్చి వేయాలి అవి వేగిన తర్వాత బ్రోకలీ వేసి 2 నిమిషాలు మగ్గించుకోవాలి.
తరువాత రెండు కప్పుల నీళ్లలో వెజిటేబుల్ స్టాక్ పొడి వేసి బాగా కలిపి బ్రోకలీ లో వేసి 10 నిమిషాలు మగ్గించుకోవాలి.
బ్రొకోలిని బ్లెండర్లో వేసి మెత్తని పేస్ట్ లా చేసుకుని అందులో క్రీం వేసి అలంకరించుకుని సర్వ్ చేసుకోడమే . అంతే ఎంతో ఆరోగ్య కరమైన సూప్ తయారు .
గమనిక :
- వెజిటేబుల్ స్టాక్ పొడి లేని వారు కూరగాయలు ఉడకపెట్టిన నీటిని వాడుకొనవచ్చు.
- బ్రొకోలిని మెత్తని పేస్ట్ లాగా ఇష్టం లేనివారు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొనవచ్చు.
No comments:
Post a Comment