కావాల్సినవి:
- తరిగిన క్యాబేజీ-1 పెద్ద కప్పు,
- పచ్చి మిర్చి-7,
- టమాటా ముక్కలు- 1 చిన్న కప్పు,
- నూనె-4 టేబుల్ స్పూన్స్,
- పసుపు-1/2 టీస్పూన్,
- జీలకర్ర-1/2 టీస్పూన్,
- ధనియాలు-1 టేబుల్ స్పూన్,
- చింతపండు-మీడియం ఉసిరికాయ అంత,
- వెల్లుల్లి రెబ్బలు-2,
- ఉప్పు-తగినంత.
స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె వేసి జీలకర్ర, ధనియాలు వేసుకుని వెంటనే క్యాబేజీ,పచ్చి మిర్చి, పసుపు, టమాటా ముక్కలు అన్ని కలిపి మంట సిమ్ లో పెట్టుకుని 20 నిమిషాలు క్యాబ్బజి మెత్తబడి వరకు మగ్గించుకోవాలి.
మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చివరగా స్టవ్ ఆఫ్ చేసి చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసుకుని మిక్సీ లో మెత్తగా రుబ్బుకొని గిన్నెలోకి తీసుకోవాలి. అంతే క్యాబేజీ పచ్చడి సిద్ధం.ఇలా చేసుకునే పచ్చడికి వేరేగా తాలింపు అవసరం లేదు, కానీ మీకు కావాలి అంటే వేసుకోవచ్చు.
No comments:
Post a Comment