Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Wednesday, 15 March 2017

Mamidikaya mukkala pachadi / Mango chutney(మామిడికాయ ముక్కాల పచ్చడి)


కావాల్సినవి :

  • పచ్చిమామిడికాయ -1
  • కారం -1 టీస్పూన్ 
  • ఉప్పు - తగినంత (1/2 టీస్పూన్)
  • పసుపు -చిటికెడు 
తాలింపు కొరకు :

  • నూనె -3 టేబుల్ స్పూన్లు 
  • జీలకర్ర -1/4 టీస్పూన్ 
  • ఆవాలు -1/4 టీస్పూన్ 
  • పచ్చిపప్పు -1 టీస్పూన్ 
  • వెలుల్లి -5 రెబ్బలు 
  • ఇంగువ -చిటికెడు 
  • కరివేపాకు -2 రెమ్మలు 
తయారీ :
ముందుగా మామిడియాను సన్నని ముక్కలుగా కోసుకుని అందులో ఉప్పు కారం మరియు పసుపు వేసి కలుపుకోవాలి .



తరువాత ఒక కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు కొరకు పెట్టుకున్న సామాను మరియు కచ్చాపచ్చాగా దంచిన వెల్లులిని వేసుకోవాలి అవి వేగిన తరువాత స్టవ్ ఆపుకుని మామిడికాయ ముక్కలని వేసి కలుపుకోవాలి.



అంతే  తేలికయిన మామిడికాయ ముక్కాలా పచ్చడి సిద్ధం. 

No comments:

Post a Comment