Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Wednesday, 21 December 2016

aloo palak curry/bangaladhumpa palakura kura(ఆలూ పాలక్ )


కావాల్సినవి: పాలకూర -1 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు -2(పెద్దవి), టమాటా ముక్కలు -1 కప్పు, ఉల్లిపాయ -1, మిర్చి -2, ధనియాలపొడి -1 టీస్పూన్, కారం -1 టీస్పూన్, గరం మసాలా-1 టీస్పూన్, ఉప్పు -తగినంత, కొత్తిమీర -కొద్దిగా, నూనె -3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర -1 టీస్పూన్, వెల్లుల్లి ముక్కలు -1 టీస్పూన్, క్రీం లేదా మీగడ పెరుగు-2/3 టేబుల్ స్పూన్స్.

తయారీ:పాలకూర మరియు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా చేసి మిక్సీ లో వేసి మెత్తని గుజ్జులా చేసుకుని పక్కన పెట్టుకోండి. తరువాత ప్రెషర్ కుక్కర్ లో బంగాళాదుంపలు వేసి ఉప్పు, నీరు పోసుకుని 2 కూతలు వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి చల్లారాకా దుంపల మీద తొక్కు తీసివేసి ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోండి.


కడాయి స్టవ్ మీద మెట్టుకుని నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు పసుపు, ఉప్పు వేసి 2 నిమిషాలు వేయించి ,టమాటా ముక్కలు కూడా వేసి మరో  5 నిమిషాలు వేయించుకోవాలి. తరువాత కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకుని కలిపి 2 నిమిషాలు వేయించి పాలకూర గుజ్జు వేసుకోవాలి.


 ఒక కప్పు నీరు పోసి 2 నిమిషాలు ఉడికిన తరువాత బంగాళాదుంప ముక్కలు కూడా వేసి కొత్తిమీర చల్లి, ఉప్పు సరి చూసుకుని ,మూత పెట్టుకుని 5 నిమిషాలు తక్కువ మంట మీద కూర దగ్గరికి పడే వరకు ఉడికించుకుని చివరగా క్రీం వేసి వడ్డించుకోవాలి. ఈ కూర చపాతీ మరియు రోటిలోకి రుచిగా ఉంటుంది. 

No comments:

Post a Comment