కావాల్సినవి: మినపప్పు-1 కప్పు, అల్లం-10 గ్రాములు ,పచ్చిమిర్చి-5, కారం-1 టేబుల్ స్పూన్, జీలకర్ర-1 టేబుల్ స్పూన్, పెద్ద ఉల్లిపాయ-1, ఉప్పు-తగినంత, కరివేపాకు-2 రెమ్మలు, కొత్తిమీర -కొద్దిగా,నూనె-డీప్ ఫ్రైకి సరిపడినంత.
తయారీ: ముందుగా మినపప్పుని శుభ్రంగా కడిగి నీరుపోసి 4-5 గంటలు నాన పెట్టుకోవాలి. తరువాత మరొకసారి శుభ్రం చేసుకొని నీరు అంతా వంపేసి పప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు మిక్సీ లేదా గ్రైండర్ లో వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. పిండి గట్టిగా ఉంటె కొద్దిగా నీరు వేసుకుని రుబ్బుకోవాలి. పిండి పలచగా అవ్వకుండా కొంచెం గట్టిగా ఉండేట్టు ముద్ద చేతికి వచ్చేట్టు చూసుకోవాలి.
తరువాత పిండిని గిన్నెలోకి తీసుకుని ఉప్పు,జీలకర్ర,కరివేపాకు,కొత్తి మీర,సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసుకుని వేడి చేసుకోవాలి. తరువాత చేతిని నీటిలో ముంచి, తరువాత పిండి తీసుకుని వేళ్ళ మీద పెట్టుకుని గారెలా చేసుకుని మధ్యలో కన్నం పెట్టి నూనెలోకి జారవిడుచుకోని ,రెండుపక్కలా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకొని తీసుకుంటే కరకరలాడే గారెలు సిద్ధం. ఇవి కొబ్బరి చట్నీ మరియు అల్లం చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.
No comments:
Post a Comment