కావాల్సినవి: టమాటాలు పెద్దవి -3, పచ్చిమిర్చి-7/8, వెల్లుల్లి రెబ్బలు-4, ఎండుమిర్చి-2, చింతపండు-ఉసిరికాయంత , ధనియాలు-2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర-1 టేబుల్ స్పూన్, పసుపు-1/2 టీస్పూన్, ఉప్పు-తగినంత, నూనె-3 టేబుల్ స్పూన్స్, పచ్చిపప్పు, మినపప్పు-1 టీస్పూన్ చొప్పున ,కరివేపాకు-2రెమ్మలు, కొత్తిమీర -కొద్దిగా.
తయారీ: ముందుగా కడాయి స్టవ్ మీద పెట్టుకుని నూనె వేసుకుని జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి వేసి 1 నిమిషం వేగాక వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, పసుపు, ఉప్పు వేసి 10 నిమిషాలు ముత పెట్టి మీడియం మంట మీద మగ్గించుకోవాలి. తరువాత చింత పండు, కొత్తిమీర వేసి 3 నిమిషాలు నీరు అంతా పోయే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
ఈ మిశ్రమాన్ని మిక్సీ లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత కడాయిలో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు, దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించుకుని పచ్చడిలో కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి సిద్ధం. అన్నం, దోశలు, చపాతీ, రోటిలోకి ఈ పచ్చడి రుచిగా ఉంటుంది.

No comments:
Post a Comment