కావల్సినవి : క్యాలీఫ్లవర్ ముక్కలు -1 కప్పు, పచ్చిమిర్చి -2, ఉల్లిపాయ -1, వెల్లులి -2 రెబ్బలు , అల్లం ముక్కలు -1/2 టీస్పూన్ ,కార్న్ ఫ్లోర్ - 1టేబుల్ స్పూన్ ,మైదాపిండి -3 టేబుల్ స్పూన్లు ,ఉప్పు -తగినంత, నూనె -2 టేబుల్ స్పూన్స్, కొత్తిమిర -2 రెమ్మలు, టమాటా సాస్ -2 టీస్పూన్స్ ,సోయాసాస్ - 1టీస్పూన్ ,మిరాయాలపొడి -1/2 టీస్పూన్ ,అజినోమోటో -1/2 టీస్పూన్, నూనె -డీప్ ఫ్రై కి తగినంత.
తయారీ : ముందుగా ఒక గిన్నెలో క్యాలీఫ్లవర్ ముక్కలు, మైదా పిండి ,కార్న్ ఫ్లోర్, ఉప్పు మరియు కొద్దిగా నీళ్లు వేసి కలపాలి. తరవాత కడాయిలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె తీసుకోవాలి. అది కాగిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి ఎర్రగా వేపి టిష్యూ పేపర్ మీద వేయాలి.
ఇలా చేయడంవల్ల అధిక నూనెని పీల్చుకుంటుంది. తర్వాత ఇంకొక కడాయి తీసుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ,అల్లం ,పచ్చిమిర్చి మరియు వెల్లులి ముక్కలు వేసి ఒక నిమిషం వేపిన తర్వాత టమాట, సోయాసాస్, మిరియాల పొడి, అజినోమోటో మరియు వెపిన క్యాలీఫ్లవర్ వేసి బాగా కలపాలి. చివరిగా కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోడమే.
No comments:
Post a Comment