కావాల్సినవి: బీట్ రూట్ తురుము-1 పెద్ద కప్పు, పచ్చిమిర్చి-2, పచ్చికొబ్బరి తురుము-1/2 కప్పు,పెసరపప్పు నాన పెట్టినవి-1/2 కప్పు ,జీలకర్ర-1/4 టీస్పూన్, ఆవాలు-1/4 టీస్పూన్, కరివేపాకు-2 రెమ్మలు, ఉప్పు-తగినంత, కారం-1 టీస్పూన్, ధనియాల పొడి-1 టీస్పూన్, గరం మసాలా-1/2 టీస్పూన్, ఉల్లిపాయ-1, పసుపు-1/4 టీస్పూన్, కొత్తిమీర -కొద్దిగా, నూనె-3 టేబుల్ స్పూన్స్, పచ్చిపప్పు-1 టీస్పూన్, ఎండు మిర్చి-2.
తయారీ: ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె పోసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర,ఎండుమిర్చి, పచ్చిపప్పు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తరువాత ఉల్లిపాయ,
పచ్చిమిర్చి ముక్కలు వేసి 2 నిమిషాలు వేయించాక అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోని, దానిలో పెసరపప్పు వేసుకుని కొంచెం ఉప్పు వేసి కలిపి మూత పెట్టుకుని తక్కువ మంట మీద 5 నిమిషాలు ఉడికించుకోవాలి.
పెసరప్పు ఉడికిన తరువాత బీట్ రూట్ తురుము వేసుకుని 3 నిమిషాలు మగ్గించి ధనియాలపొడి, కారం, గరం మసాలా వేసి 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చివరగా కొత్తిమీర, పచ్చి కొబ్బరి వేసి కలయ బెట్టి మరో 5 నిమిషాలు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెలోకి తీసుకొని వడ్డించుకోవాలి.

No comments:
Post a Comment