కావాల్సినవి : ఎండుమిర్చి -7, పల్లీలు -1 కప్పు, ధనియాలు -1 టేబుల్ స్పూన్ ,జీలకర్ర -1 టీస్పూన్ ,వెల్లుల్లి -2 రెబ్బలు , ముడి చింతకాయ పచ్చడి - 2 టేబుల్ స్పూన్లు, నూనె -2 టేబుల్ స్పూన్లు.
తాలింపు కొరకు : ఆవాలు -1/4 టీస్పూన్ , జీలకర్ర -1/4 టీస్పూన్ , పచ్చిపప్పు- 1 టీస్పూన్ , మినపప్పు -1 టీస్పూన్ ,ఇంగువ -చిటికెడు ,కరివేపాకు -2 రెమ్మలు , ఎండుమిర్చి -2.
తయారీ: ముందుగా కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి ఎండుమిర్చి, పల్లీలు ,ధనియాలు మరియు జీలకర్ర వేసి ఒక నిమిషం వేపుకోవాలి. మిక్సీ జారులో వేపిన దినుసులు, వెల్లులి, చింతకాయ ముడి పచ్చడి, 1/4 కప్పు నీరు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
తరువాత ఇంకొక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ పోసి తాలింపు సామాను వేసి అవి చిటపటలాడిన తర్వాత మిక్సీ పట్టిన మిశ్రమంలో కలపాలి. అంతే ఎంతో రుచికరమైన చింతకాయ పచ్చడి సిద్ధం.
గమనిక: చింతకాయ ముడి పచ్చడి లేనివారు చింతపండు వేసుకొనవచ్చు.
No comments:
Post a Comment