కావాల్సినవి: టమాటాలు -3, చింతపండు -1/2 నిమ్మకాయ సైజు ,ఉప్పు -1/2 టీస్పూన్ ,కారం -1/2 టీస్పూన్ ,పసుపు -1/4 టీస్పూన్ ,మిరియాలు -1/2 టీస్పూన్ ,జీలకర్ర -1/2 టీస్పూన్ ,ధనియాలు -1 టేబుల్ స్పూన్, కొత్తిమీర -2 రెమ్మలు.
తాలింపు కొరకు : ఆవాలు -1/4 టీస్పూన్ ,జీలకర్ర -1/4 టీస్పూన్ ,పచ్చిపప్పు మరియు మినపప్పు- 1/2 టీస్పూన్ చొప్పున ,ఎండుమిర్చి -2, వెల్లులి రెబ్బలు -3,అల్లం -చిన్న ముక్క, కరివేపాకు -2 రెమ్మలు, నూనె /నెయ్యి -2 టేబుల్ స్పూన్లు.
తయారీ : ముందుగా ఒక గిన్నెలో టమాటాలు, చింతపండు ,ఉప్పు ,కారం, పసుపు, మిరియాలు ,జీలకర్ర ,ధనియాలు మరియు కొత్తిమీర వేసుకుని బాగా పిసికి 2 కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి మరిగించుకోవాలి.
తరువాత చిన్న కడాయి తీసుకుని తాలింపు కొరకు ఉంచుకున్న సామాను వేసుకోవాలి అవి చిటపట లాడిన తరువాత అల్లం మరియు వెల్లులి దంచి తాలింపులో వేసుకుని ఒక నిమిషం వేయించుకుని చారులో వేసుకోవాలి. అంతే మీ ముందు రుచికరమైన టమాటా చారు సిద్ధం . రసం పొడి లేకపోయినా మనం రుచిగా చారు చేసుకోవచ్చు.
No comments:
Post a Comment